అన్వేషించండి

KBC winner bankrupt: KBCలో విన్నర్ ఇప్పుడు చిరుద్యోగి - రూ.5 కోట్లు వచ్చిపడటంతోనే అతని జీవితం నాశనం !

KBC winner: డబ్బులు సంపాదించడమే కాదు .. సంపాదించుకోవడం నిలుపుకోవడం కూడా ఓ కళే. అది చేతకాకపోతే ఎన్నికోట్లోచ్చినా దివాలా తీస్తారు.దానికి సుశీల్ కుమారే ఉదాహరణ.

KBC winner won Rs 50000000 Now bankrupt :  కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) ఐదవ సీజన్‌ విజేత సుశీల్ కుమార్.  2011లో రూ. 5 కోట్లు గెలుచుకున్న తొలి విజేతగా గుర్తింపు పొందాడు. బీహార్‌లోని చంపారన్‌కు చెందిన  సుశీల్ కుమార్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. అయితే, అతని జీవితం ఊహించని మలుపులు తిరిగింది, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, వ్యక్తిగత సవాళ్లతో అతని కథ ఒక విషాదకరమైన దశకు చేరుకుంది. ఇప్పుడు ఆ ఐదు కోట్లు పోగొట్టుకున్నాడు. బతకడానికి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. 

 బీహార్‌లోని చంపారన్‌కు చెందిన  సుశీల్ కుమార్  కంప్యూటర్ ఆపరేటర్‌గా ,  ఉపాధ్యాయుడిగా నెలకు రూ. 6,000 సంపాదిస్తూ సామాన్య జీవితాన్ని గడిపాడు. కేబీసీలో పాల్గొనడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఐదు కోట్లు గెలుచుకోవడంతో  బీహార్‌లో స్థానిక సెలబ్రిటీగా  మారారు.  అతన్ని అమితాబ్ బచ్చన్ "నిజ జీవిత స్లమ్‌డాగ్ మిలియనీర్" అని పిలిచాడు. KBCలో గెలిచిన తర్వాత, అతను ఐఏఎస్ అధికారి కావాలని కలలు కన్నాడు. కానీ జరిగింది వేరు. 

KBCలో గెలిచిన తర్వాత, సుశీల్ కుమార్ ఒక్కసారిగా వచ్చిన డబ్బు,  ఖ్యాతినితో దారి తప్పాడు.  2020లో ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో తన జీవితంలోని కష్టకరమైన దశలను పంచుకున్నాడు.  సుశీల్ తన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టలేకపోయాడు. అతను అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు, కానీ అనుభవం లేకపోవడం వల్ల అవి కొన్ని రోజుల్లోనే కుప్పకూలాయి. అతన్ని చందాల కోసం పలు కార్యక్రమాలకు పిలిచేవారు. అలాంటి కార్యక్రమాలకు వెళ్లి డబ్బులు చందాలుగా ఇచ్చి వచ్చేవాడు.  సుశీల్ ను పలువురు వ్యాపారులు పార్టీలకు పిలిచేవారు. ఈ సందర్భంగా మద్యం, సిగరెట్లు అలవాటు చేసుకున్నాడు.   

వచ్చిన డబ్బులను జాగ్రత్త చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయడంపై  అతని భార్యతో సంబంధం దెబ్బతింది. ఓ దశలో వారు విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారు.  సుశీల్ కుమార్ ఆర్థిక స్థితి క్షీణించడంతో, అతను దివాళా తీసినట్లు పుకార్లు వచ్చాయి. ఓ ఇంటర్యూలో సుశీల్ తన డబ్బు అయిపోయిందని, రెండు ఆవులను పెంచి, పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. ఈ వార్త వైరల్ అయింది, దీని తర్వాత అతన్ని ఈవెంట్‌లకు ఆహ్వానించడం ఆగిపోయింది. తర్వాత సుశీల్  సినిమా దర్శకుడు కావాలని నిర్ణయించుకుని ముంబైకి వెళ్లాడు, కానీ అక్కడ అతని కలలు నెరవేరలేదు. ఇక కుటుంబాన్ని నిలుపుకోవాలంటే తప్పదని.. చంపారన్‌కు వచ్చి మళ్లీ టీచర్ గా జాయినయ్యాడు. 

జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బులకే నిలకడ ఉంటుందని పెద్దలకు చెబుతారు.  అయితే ఆ కష్టం అనేది .. కష్టపడిన వారు కూడా గుర్తించాలి. చిన్న తనం నుంచి ఎంతో చదువుకుని జ్ఞానం పోగేసుకుంటే తప్ప కేబీసీలో విన్నర్ గా నిలవడం సాధ్యం కాదు. అలాంటి విజయాన్ని నెత్తికెక్కించుకుంటే మొదటికే మోసం వస్తుంది. సుశీల్ కుమార్ పరిస్థితి అదే. చాలా మంది ఈ విషయంలో సుశీల్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.               

 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Protest: దిల్లీలో 9 గంటల హై వోల్టేజ్ నిరసన.. 2 గంటల నిర్బంధం.. రాహుల్ గాంధీ నిరసనలో ఏం జరిగింది?
దిల్లీలో 9 గంటల హై వోల్టేజ్ నిరసన.. 2 గంటల నిర్బంధం.. రాహుల్ గాంధీ నిరసనలో ఏం జరిగింది?
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
ABP Desam Top 10, 7 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 7 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget