Karnataka IAS vs IPS: పోస్టులు పెట్టి పరువు తీస్తున్నావు, కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించు- ఐపీఎస్ కు ఐఏఎస్ షాక్ !
Karnataka IAS vs IPS: కర్ణాటకలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారిణుల మధ్య వ్యక్తిగత గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రోహిణి సింధూరి తనకు నష్టపరిహారం చెల్లించమంటూ రూపాకు లీగల్ నోటీసులు పంపింది.
Karnataka IAS vs IPS: కర్ణాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణుల మధ్య గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఐపీఎస్ అధికారిణి డి.రూపా మౌద్గిల్ ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టగా.. అందుకు రిప్లై ఇస్తూ రోహిణి సింధూరి రూపాకు లీగల్ నోటీసులు పంపింది. బేషరతుగా లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం కల్గించినందుకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో వెల్లడించారు. ఈ వ్యవహహారం తమకు తెలిసిన వారి మధ్య ఒక చర్చనీయంశంగా మారిందని.. అప్పటినుంచి తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పుకొచ్చింది. అలాగే తనను ఉద్దేశించి పెట్టిన ఫేస్ బుక్ పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బుధవారం (ఫిబ్రవరి 22) సోషల్ మీడియాలో కొత్త పోస్ట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం బాగుండాలి కాబట్టే నేను ఇలా పోరాడుతున్నానని అన్నారు. తాను, తన భర్త ఇంకా కలిసి ఉన్నామని, ఊహాగానాలు వద్దని స్పష్టం చేశారు. సుఖ-సంసారాలను చెడగొడుతున్న వారిని ప్రశ్నించాలని, లేకపోతే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయని అన్నారు. ‘‘రోహిణి సింధూరిపై నేను లేవనెత్తిన అవినీతి అంశంపై దృష్టి పెట్టండి. సామాన్య ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని నేను ఆపను. నేను ధైర్యవంతురాలిని కాబట్టి నేను పోరాడతాను. స్త్రీలంద
మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
కర్ణాటకలో ఓ ఐఏఎస్ అధికారి మృతి చెందగా, తమిళనాడులో ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ఐఏఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుంది. అందుకే నేను జాగ్రత్త పడుతున్నా’ అని రూపా తన పోస్టులో రాశారు. ఎవరి పేరును బహిర్గతం చేయకుండా తాను చెప్పాల్సిన అంశాలను పరోక్షంగా పోస్టులో రాసుకొచ్చారు. అయితే, రూపా మౌద్గిల్‌తోపాటు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి ఆరోపణలను చేసుకోవద్దని, బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితాశర్మ ఇప్పటికే ఆదేశించారు. ఇద్దరినీ బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. అయినా రూపా మౌద్గిల్ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం గమనార్హం. రికీ ఆ శక్తి ఉండదు. అలాంటి మహిళల కోసం గొంతు కలుపుదాం. కుటుంబ విలువలకు భారతదేశం పెట్టింది పేరని, దానిని కొనసాగిద్దాం అని అన్నారు. మరో సంచలనం అయింది. బుధవారం (ఫిబ్రవరి 22) సోషల్ మీడియాలో కొత్త పోస్ట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం బాగుండాలి కాబట్టే నేను ఇలా పోరాడుతున్నానని అన్నారు. తాను, తన భర్త ఇంకా కలిసి ఉన్నామని, ఊహాగానాలు వద్దని స్పష్టం చేశారు. సుఖ-సంసారాలను చెడగొడుతున్న వారిని ప్రశ్నించాలని, లేకపోతే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయని అన్నారు.
సామాజిక కార్యకర్త గంగరాజుతో జరిగిన ఆడియో సంభాషణపై రూపా మౌద్గిల్ వివరణ ఇచ్చారు. ‘‘నేనెప్పుడూ అవినీతి కోసం పని చేయలేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఆపమని నేను గంగరాజుకు చెప్పలేదు. ఆడియోపై అనవసరంగా చర్చ జరుగుతోంది. రోహిణి సింధూరి అవినీతి గురించి మాత్రమే చర్చ జరగనివ్వండి. కుటుంబ, వ్యక్తిగత అంశాలు ఇక్కడ చర్చకు రాకూడద’’ని వ్యాఖ్యానించారు.