News
News
X

Karnataka Government On Bakrid: బక్రీద్‌ రోజు ఆవుల్ని చంపితే ఊరుకోం, కర్ణాటక సర్కార్ వార్నింగ్

బక్రీద్‌ రోజున బలి పేరిట గోవులను వధించటానికి వీల్లేదని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిబంధనలు అతిక్రమిస్తే కఠని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

FOLLOW US: 

గోవుల్ని బలి ఇవ్వటానికి వీల్లేదు..

ముస్లింల అతి పెద్ద పండుగగా భావించే బక్రీద్‌ రోజున గో వధ చేయటానికి వీల్లేదని స్పష్టం చేసింది కర్ణాటక ప్రభుత్వం. పశుసంవర్థక శాఖ మంత్రి ప్రభు బి చవాన్ ఈ ప్రకటన చేశారు. బక్రీద్‌ రోజు ఆవుల్ని అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జంతు వధ నిర్మూలనా చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు. పండుగ రోజు ఎవరూ గోవుల్ని బలి ఇవ్వకూడదని ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే అధికారులందరినీ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా గోవధ జరగకుండా చూడాలని ఆదేశించింది. పశుసంవర్థక శాఖ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి గోవుల్ని తరలించకుండా చూడాలని చెప్పింది. బక్రీద్‌ రోజున దూడలు, ఆవులు, ఒంటెల్ని బలి ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ వధను సహించేది లేదని, కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఎవరైనా ఈ ఆదేశాలను లెక్క చేయకుండా గోవులను బలి ఇస్తే కఠిన కేసులు నమోదు చేస్తామని వెల్లడించింది. కర్ణాటక ప్రభుత్వం గోవధను నిషేధించింది. 

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..
 
"పశుసంవర్థక శాఖ అధికారులు, పోలీసులు గోవధ జరగకుండాపై నిఘా ఉంచారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లోనూ పోలీసులున్నారు. గోవధ నిషేధాన్ని ఉల్లంఘించకుండా చూస్తారు. ఎవరైనా పట్టుబడితే లోకల్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేస్తారు. కఠిన చర్యలు తీసుకుంటారు" అని పశుసంవర్థక శాఖ మంత్రి ప్రభు బి చవాన్ వెల్లడించారు. నిఘా కళ్లుగప్పి ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిస్తే, ఆ ప్రాంతంలోని అధికారే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని..వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే-BBMP పరిధిలో గోవధను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ ఫోర్స్‌ను నియమించింది ప్రభుత్వం. గోవధను నిషేధించేందుకు 'ప్రివెన్షన్​ ఆఫ్​ స్లాటర్​ అండ్​ ప్రిజర్వేషన్​​ ఆఫ్​ కాటిల్​ బిల్​-2020'ను కర్ణాటక అసెంబ్లీ 2020లోనే ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో గోవధపై పూర్తిగా నిషేధం. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా గోవుల అక్రమ రవాణా, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ చట్టానికి లోబడి ఉండాలని ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. 

Also Read: Actor Vikram Hospitalized: ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన విక్రమ్ - ఆయనకు ఏమైందంటే?

Also Read: Mahabubnagar: వరదలో చిక్కుకుపోయిన ప్రైవేటు స్కూల్ బస్సు, లోపల 25 మంది పిల్లలు

Published at : 08 Jul 2022 03:26 PM (IST) Tags: karnataka Cow Slaughtering Cow Slaughter Ban Bakrid Karnataka

సంబంధిత కథనాలు

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

టీచర్‌తో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్యకు సుపారీ - చివరికి ఏమైందంటే !

టీచర్‌తో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్యకు సుపారీ - చివరికి ఏమైందంటే !

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Petrol-Diesel Price, 14 August: నేడు ఈ సిటీలో భారీగా తగ్గిన ఇంధన రేట్లు - ఇక్కడ మాత్రమే పెరుగుదల, తాజా ధరలు ఇవీ

Petrol-Diesel Price, 14 August: నేడు ఈ సిటీలో భారీగా తగ్గిన ఇంధన రేట్లు - ఇక్కడ మాత్రమే పెరుగుదల, తాజా ధరలు ఇవీ

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...

ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

iPhone 14: ఐఫోన్ 14 విషయంలో అవి రూమర్లే - వెలుగులోకి కొత్త వివరాలు!

iPhone 14: ఐఫోన్ 14 విషయంలో అవి రూమర్లే - వెలుగులోకి కొత్త వివరాలు!