అన్వేషించండి

స్మోక్ బిస్కెట్స్‌ తిని స్పృహ తప్పి పడిపోయిన బాలుడు, వీటిని పిల్లలకు దూరంగా ఉంచండి

Smoke Biscuits: కర్ణాటకలో స్మోక్ బిస్కెట్స్‌ తిని ఓ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

What Are Smoke Biscuits: కర్ణాటకలో గత వారం Smoke Biscuits తిని ఓ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దవనగెరె సిటీలో ఓ షాప్‌లో వాటిని కొనుక్కుని తిన్నాడు. ఆ తరవాతే ఆసుపత్రి పాలయ్యాడు. లిక్విడ్ నైట్రోజన్‌తో తయారు చేసిన ఆ బిస్కెట్స్‌ వల్లే ఇలా జరిగిందని వైద్యులు వెల్లడించారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే ఆ షాప్‌ లైసెన్స్‌ని రద్దు చేశారు. షాప్‌నూ మూసేశారు. అయితే...ఈ స్మోక్ బిస్కెట్స్ తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిస్పోజబుల్ కప్‌లో వాటిని సర్వ్ చేస్తున్నాడు ఆ వెండార్. ఈ బిస్కెట్స్‌ని ఓ బాలుడు నోట్లో వేసుకున్న వెంటనే బయటకు ఉమ్మేశాడు. చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తరవాత కాసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ వీడియోలో ఇదంతా రికార్డ్ అయింది. ఓ ఎగ్జిబిషన్‌లో ఇది జరిగింది. లిక్విడ్ నైట్రోజన్ మోతాదు ఎక్కువవడం వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడిందని ఆ పోస్ట్‌లో నెటిజన్‌ వివరించాడు. 

ఏంటీ స్మోక్ బిస్కెట్స్..?

స్మోక్ బిస్కెట్స్‌ని లిక్విడ్ నైట్రోజన్‌తో తయారు చేస్తారు. దీన్ని కూలంట్‌గా వాడతారు. ఇది నోట్లో వేసుకుంటే నోటితో పాటు గొంతు, కడుపుకీ ప్రమాదమే. తీవ్రంగా గాయపరిచి ఇబ్బంది పెడుతుంది. లిక్విడ్ నైట్రోజన్‌ మన శరీరంలోకి వెళ్తే అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బాడీ టెంపరేచర్ 196 డిగ్రీల వరకూ పెరిగే ప్రమాదముంది. స్కిన్ అలెర్జీ, నోటిపూత, కడుపు నొప్పితో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ మధ్య Dry Ice తీసుకున్న వాళ్లూ ఇలాగే ఆసుపత్రి పాలయ్యారు. అది కూడా ప్రమాదకరమే. డ్రై ఐస్, లిక్విడ్ నైట్రోజన్ తెల్లటి ఆవిర్లతో ఉంటాయి. ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు వీటిని వినియోగిస్తారు. వీటిని నేరుగా తినడం, చర్మంపై అప్లై చేసుకోవడం లాంటివి చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Malvan Resort Accident: డైవింగ్ చేసి స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకాడు - ఇక అంతే - షాకింగ్ వీడియో
డైవింగ్ చేసి స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకాడు - ఇక అంతే - షాకింగ్ వీడియో
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Embed widget