By: Ram Manohar | Updated at : 02 Apr 2023 02:23 PM (IST)
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భారీగా ర్యాలీలు చేపట్టనున్నారు.
Karnataka Elections 2023:
భారీగా ర్యాలీలు..
కర్ణాటకలో ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ సారి బీజేపీ గెలవడం కష్టమే అన్న వాదనలతో పాటు కాంగ్రెస్ నిలదొక్కుకోవడం కష్టమే అని మరి కొందరు వాదిస్తున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో రెండు వేరు వేరు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టారు ఓటర్లు. హిమాచల్‌లో మోదీ మేజిక్ వర్కౌట్ అవ్వలేదు. కానీ...కర్ణాటకలో మాత్రం కచ్చితంగా ప్రధాని మోదీ చరిష్మా ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీయే స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు. ర్యాలీలు, సభలతో బిజీబిజీగా గడిపేస్తారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ...ఇక్కడా భారీగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కనీసం 20 ర్యాలీలు చేసేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది. మే 10న ఎన్నికల జరగనున్నాయి. అయితే...చివరిత విడత ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశాలున్నాయి. అంటే...మే 6-8వ తేదీ వరకూ రాష్ట్రంలోనే పర్యటించనున్నట్టు తెలుస్తోంది.
అవినీతి ఆరోపణలు..
కాంగ్రెస్, జేడీఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తోంది కర్ణాటక బీజేపీ. రాజకీయాల పరంగా చూస్తే...కర్ణాటకలో కీలకంగా 6 జోన్లు ఉన్నాయి. ఈ 6 జోన్లలోనూ కనీసం మూడు ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందుకే ఈ ప్రాంతంపైనే ప్రధాని ఎక్కువగా దృష్టించాలని చూస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో మల్లికార్జున్ ఖర్గేకు మంచి పాపులారిటీ ఉంది. అందుకే కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ ఎంత కష్టపడినా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 15 సీట్లకు మించి సాధించలేకపోయింది. ఈ సారి ఈ సీట్ల సంఖ్య పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉన్నప్పటికీ...ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేర కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం బసవరాజు బొమ్మైపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొందరు బీజేపీ నేతలూ కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఎంత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని బీజేపీ ప్రచారం చేసుకున్నప్పటికీ...ఈ సవాళ్లు దాటుకోవాల్సి ఉంటుంది. అందుకే...ఈ సారి పూర్తిగా ప్రధాని మోదీ చరిష్మాపైనే ఆధారపడుతోంది కర్ణాటక బీజేపీ. అటు మోదీ కూడా కర్ణాటకకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హుబ్లీ, మాండ్యలో ర్యాలీలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. అవినీతికి పాల్పడింది సొంత పార్టీ నేతలపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్న సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒకే విడతలో ఎన్నికలు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 10 వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. మే 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల ఆఖరు తేదీ ఏప్రిల్ 20గా నిర్ణయించిన ఈసీ..21వ తేదీన వాటిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 24 ఆఖరి గడువుగా ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీనాటికి 18 ఏళ్లు పూర్తైన ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అర్హులేనని వెల్లడించింది. 80 ఏళ్లు దాటిన వారెవరైనా...ఇంటి నుంచే ఓటువేసే అవకాశం కల్పించింది. వోట్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. గిరిజన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. దివ్యాంగులకూ ఇదే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. 2018-19 నుంచి ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది. 9.17 లక్షల మంది ఓటర్లు పెరిగినట్టు స్పష్టం చేసింది.
Also Read: Deve Gowda: ముందు మీ ఇంటి సమస్యలు పరిష్కరించుకోండి, కాంగ్రెస్‌పై దేవెగౌడ సెటైర్
EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం
Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
ABP Desam Top 10, 5 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?