అన్వేషించండి

Japan bans Indian mangoes: భారతీయ మామిడిపై జపాన్ బ్యాన్ - 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సీన్.. ఎగుమతిదారుల్లో ఆందోళన!

Vapour Heat Treatment deficiencies: జపాన్ ప్రభుత్వం భారతీయ మామిడి దిగుమతులను నిలిపివేసింది. క్వారంటైన్ లోపాల కారణంగా అల్ఫోన్సో, కేసర్, బంగానపల్లి రకాల ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది.

Japan bans  Indian  mango export:  జపాన్ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న భారతీయ మామిడి పండ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన , శుద్దీకరణ  ప్రక్రియలో లోపాలున్నాయంటూ జపాన్ ప్రభుత్వం భారతీయ మామిడి దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది.   భారతీయ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీలలో  వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ , డిసిన్ఫెక్షన్ ప్రక్రియలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని జపాన్ క్వారంటైన్ అధికారులు గుర్తించారు. మార్చి 25, 2026 తర్వాత జారీ చేసిన ఇన్‌స్పెక్షన్ సర్టిఫికేట్లు కలిగిన ఏ రకమైన మామిడి షిప్‌మెంట్లను తమ దేశంలోకి అనుమతించబోమని జపాన్ ప్లాంట్ ప్రొటెక్షన్ స్టేషన్ స్పష్టం చేసింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు మామిడి ఎగుమతులకు పీక్ సీజన్ కావడంతో, ఈ నిర్ణయం భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

 లోపాలు ఎక్కడ జరిగాయి? 

మామిడి పండ్ల ద్వారా తెగుళ్లు వ్యాపించకుండా ఉండేందుకు రసాయన రహితంగా చేసే  వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్రక్రియను జపాన్ అధికారులు ప్రతి ఏటా పర్యవేక్షిస్తారు. ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహ్మాన్‌పూర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వసతులను పరిశీలించిన జపాన్ బృందం.. ఫ్యూమిగేషన్  ,  శుద్దీకరణ చర్యల్లో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. భారతీయ సౌకర్యాలు తమ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపడే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకటించింది.

 ప్రభావం పడే మామిడి రకాలు 

జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన అల్ఫోన్సో , కేసర్  , లంగ్రా  ,  మన తెలుగు రాష్ట్రాల గర్వకారణమైన బంగానపల్లి రకాల ఎగుమతులకు బ్రేక్ పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్‌కు చెందిన  కేసర్  మామిడి జపాన్ మార్కెట్‌లో సింహభాగాన్ని ఆక్రమించింది. మొత్తం ఎగుమతుల విలువ సుమారు  1.54 మిలియన్ డాలర్ల వరకు ఉండగా, ఇప్పుడు ఒక్కసారిగా ఆర్డర్లు రద్దు కావడంతో రైతులు, వ్యాపారులు అయోమయంలో పడ్డారు.  

 20 ఏళ్ల నాటి చేదు జ్ఞాపకాలు 

భారతీయ మామిడిపై జపాన్ నిషేధం విధించడం ఇది రెండోసారి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006లో  ఇలాంటి ఒక సుదీర్ఘ నిషేధం తొలిగింది. 1986లో పండ్ల ఈగలు సోకుతాయనే భయంతో జపాన్ విధించిన నిషేధం రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. అప్పట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి కమల్ నాథ్ నిరంతర చర్చలు, శాస్త్రీయ పరీక్షల తర్వాత 2006లో ఆ నిషేధాన్ని ఎత్తివేయించారు. ఇప్పుడు మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత అదే తరహాలో క్వారంటైన్ ఆంక్షలు రావడం ఆందోళన కలిగిస్తోంది.

 భవిష్యత్తు ఏంటి? 

జపాన్ మార్కెట్ చిన్నదే అయినప్పటికీ, అక్కడి క్వారంటైన్ నిబంధనలు ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ప్రస్తుతం అమెరికా, యూఏఈ, యూకే , నెదర్లాండ్స్ వంటి దేశాలు భారత మామిడికి పెద్ద మార్కెట్లుగా ఉన్నప్పటికీ, జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇతర దేశాలు కూడా నిఘా పెంచే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వద్ద లోపాలను సరిదిద్ది జపాన్ అధికారులతో చర్చలు జరిపితే తప్ప ఈ ఏడాదికి మామిడి ఎగుమతులు పట్టాలెక్కేలా కనిపించడం లేదు. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Breaking News: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Malvan Resort Accident: డైవింగ్ చేసి స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకాడు - ఇక అంతే - షాకింగ్ వీడియో
డైవింగ్ చేసి స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకాడు - ఇక అంతే - షాకింగ్ వీడియో
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget