By: Ram Manohar | Updated at : 09 Dec 2022 12:03 PM (IST)
ఇరాన్‌లో హిజాబ్ ఉద్యమంలో పాల్గొంటున్న మహిళల మర్మాంగాలపై భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నాయి.
Iran Hijab Protest:
ఛాతి, ముఖంపైనా కాల్పులు..
హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నియంతృత్వ వైఖరిపై మహిళలు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. ఇరాన్ భద్రతా దళాలు నిరసనల్లో పాల్గొనే మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. కనిపిస్తే చాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నాయి ఈ బలగాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలపై ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుపుతున్నాయి. ముఖం, ఛాతి, జననాంగాలను లక్ష్యంగా చేసుకుని ఫైరింగ్ చేస్తున్నట్టు వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కొంత మంది మెడికోలను స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేయగా...ఈ సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. గాయ పడిన మహిళలకు రహస్యంగా వైద్యం చేస్తున్న కొందరు నర్స్‌లు, వైద్యులు ఈ విషయం చెప్పారు. వీళ్లు మళ్లీ పోలీసుల కంటపడకుండా...అరెస్ట్ అవకుండా వైద్య సిబ్బందే రక్షిస్తున్నారు. అయితే...పురుషులనూ టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్నారని..
కాకపోతే..వాళ్ల కాళ్లపై, వెనక భాగంలో ఫైరింగ్ చేస్తున్నారని తెలిపారు. కానీ...మహిళలపై మాత్రం ఇలా పాశవికంగా జననాంగాలపై కాల్పులు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యులు. దేశమంతా
జననాంగాల్లో షాట్ బాల్స్
ఇంటర్నెట్‌ను బ్లాక్ చేసిన కారణంగా...గాయాల ఫోటోలను బయట పెట్టలేకపోయారు. అయితే..వాటిని ప్రింట్ తీసి మీడియా ప్రతినిధులకు చూపించారు. వాళ్లెంత దారుణంగా గాయపడ్డారో ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతోందని మీడియా కథనాలు చెబుతున్నాయి. మరీ దగ్గర నుంచి వారిని కాల్చారని వెల్లడించాయి. శరీరమంతా బులెట్ బాల్స్ చొచ్చుకుపోయినట్టు సమాచారం. "మహిళలను కావాలనే అలా టార్గెట్
చేసుకుంటున్నారు. వాళ్ల ముఖంపై కాల్పులు జరిపి వాళ్లు అందంగా కనిపించకుండా చేస్తున్నారు. కక్ష తీర్చుకుంటున్నారు. ఓ 20 ఏళ్ల యువతికి జననాంగాల్లోనూ బులెట్ బాల్స్ కనిపించాయి. కొందరికి తొడలో బులెట్స్ దూసుకుపోయాయి. జననాంగాల్లో షాట్ బాల్స్ దూసుకెళ్లడం వల్ల వజైనల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. అందుకే...గైనకాలజిస్ట్‌లను సంప్రదించాలని సలహా ఇస్తున్నాం" అని వైద్యులు వెల్లడించారు.
తప్పులు సరిదిద్దుకుంటూ..
ఇరాన్‌లో హిజాబ్ ఉద్యమానికి కారణమైన తప్పుల్ని సరిదిద్దుకుంటోంది ప్రభుత్వం. మొరాలిటీ పోలీస్ అత్యుత్సాహంతో ఓ యువతి మృతి చెందింది. అప్పటి నుంచి ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ సమస్యంతా ఆ మొరాలిటీ పోలీసుల వల్లే వచ్చిందని భావించిన ప్రభుత్వం...ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రాసిక్యూటర్ జనరల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మొరాలిటీ పోలీస్ యూనిట్స్ అన్నింటినీ తొలగించింది. "న్యాయవ్యవస్థలో మొరాలిటీ పోలీసింగ్‌కు స్థానం లేదు. ఈ వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదు" అని అటార్నీ జనరల్ మహమ్మద్ జాఫర్ వెల్లడించారు. గతంలో ఈ మొరాలిటీ పోలీస్‌లను "గైడెన్స్ పాట్రోల్" గా పిలిచేవారు. హిజాబ్ సంస్కృతిని విస్తృతం చేయాలనే లక్ష్యంతో...ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2006లో ఇరాన్ అధ్యక్షుడిగా మహమౌద్ అహ్మదినెజాద్ ఉన్న సమయంలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పాట్రోలింగ్ కొనసాగుతోంది.
Also Read: ఇండియా మరో సూపర్ పవర్ దేశంగా ఎదిగి తీరుతుంది - వైట్‌హౌజ్ ప్రతినిధి
TSLPRB: ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం! ఏంటంటే?
విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు
Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్ఎంల నిర్బంధం
Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి