Indore Tragedy: మధ్యప్రదేశ్ లో దారుణం - గుడిలో కూలిన మెట్లబావి, 35 మంది మృతి!
Indore Tragedy: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. పండుగరోజునే మెట్లబావి కూలిపోయి ఈ ప్రమాదం జరిగింది.
Indore Tragedy: మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ లోని బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి రోజున గుడిలో ఉన్న మెట్లబావి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల్లో 18 మంది మహిళలు, బాలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బావి శిథిలాలలో చిక్కుకున్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. మోహౌ నుంచి వచ్చిన ఆర్మీ సిబ్బంది శిథిలాలలో సమాధి అయిన వ్యక్తులను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా ఉంది.
इंदौर में रामनवमी के दिन मंदिर हादसे में मरने वालों की संख्या बढ़कर 34 हुई, कुछ लोग अभी भी लापता, बचाव कार्य जारी, सेना ने मोर्चा सँभाला @ABPNews @vivekbajpai84 pic.twitter.com/K8ScIZbkiZ
— Brajesh Rajput (@brajeshabpnews) March 31, 2023
40 అడుగుల లోతు మెట్ల బావి..
ప్రజలందరూ ఆలయం లోపల ఉన్న మెట్ల బావి పైన ఉన్న పలకపై కూర్చుని పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్లాబ్ లోపలికి దూసుకెళ్లింది. దీంతో 30 మందికి పైగా మెట్ల బావిలో పడిపోయారు. మెట్ల బావి దాదాపు 40 అడుగుల లోతు ఉంటుంది. 4 నుంచి 5 అడుగుల మేర నీరు నిండిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో తాళ్ల సహాయంతో బావిలో నుంచి ప్రజలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను బావిలో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. అదే సమయంలో, గాయపడిన వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మున్సిపల్ కార్పొరేషన్ మూడు పంపుల సహాయంతో స్టెప్‌వెల్ నుంచి నీటిని తీసే పనిలో నిమగ్నమై ఉంది. దీంతో పాటు డైవర్లను ఆక్సిజన్‌తో బావిలోకి దింపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా అక్కడికక్కడే ఉంది. మెట్లబావిలో చాలా చిత్తడి ఉందని చెబుతున్నారు.
70 మంది ఆర్మీ సిబ్బంది మోహరింపు..
దాదాపు 70 మంది ఆర్మీ సిబ్బంది గురువారం రాత్రి 11 గంటలకు మోవ్ నుండి వచ్చారు. ఈ సైనికులు బావిలో పడిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. సైన్యానికి చెందిన ఈ సైనికులు మెట్ల బావిలోపల ఊయల వేసి సైనికులను అందులో కూర్చోబెట్టి కట్టర్ మిషన్‌తో మెట్ల బావిలోని రీబార్‌ను కత్తిరించారు. ఇంకా కొందరు ఇక్కడే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.