అన్వేషించండి

Nita Ambani : సంపద అంటే లక్షల కోట్లు కాదు - నీతా అంబానీ చెప్పిన నిజమైన వెల్త్ ఏమిటో తెలుసా ?

Ambani Wealth : ఎంత సంపాదించేవేంటి అని.. అని ఎదురుగా కనిపించిన ప్రతి పరిచయస్తుడ్ని అడిగేవారుంటారు కొందరు. ఇంత సంపాదించామని గొప్పలు చెప్పుకునేవారుంటారు. అసలు సంపద అంటే ఏమిటి ?

Money Meant to Nita Ambani :   దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వారిలో ఒకరు ముఖేష్ అంబానీ. ఆయన సతీమణి నీతా అంబానీ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. లగ్జరీగా కుటుబం కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాదు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నీతా అంబానీ దృష్టిలో అసలు డబ్బుకు ఉన్న విలువ ఎంత..?.  ఆమె డబ్బుకు ప్రాధాన్యం ఇస్తారా ?. అసలు సంపద అంటే ఏమనుకుంటున్నారు ? ఇలాంటి విషయాలను ఓ ఇంటర్యూలో పంచుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్యూలో డబ్బు, సంపదపై ఆమె అబిప్రాయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

జీవితాంతం తోడు ఉండేది జ్ఞాపకాలే !

సంపద ఎంత ఉంది  అన్నది కాదు.. ఉన్న  సంపదను ఎలా వినియోగించుకున్నామన్నది ముఖ్యమన్న తన అభిప్రాయమని నీతా అంబానీ చెబుతున్నారు. సంపద అనేదానికి ఎప్పుడో ఒక చోట అంతం ఉంటుందని నీతా అంబానీ చెప్పుకొచ్చారు. ఒక రోజు ఉంటుంది.. మరో రోజు ఉండదని.. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటున్నారు. జీవితంలో ప్రతి క్షణం డబ్బును సంపాదించడానికి.. సంపద సృష్టించడానికి ఉపయోగించడం కాదని నీతా అంబానీ స్పష్టం చేశారు. జీవితం అంటే.. మధురమైన జ్ఞాపకాలను సష్టించుకోవడం అన్నారు. మనతో పాటు .. ప్రయాణించేది మన జ్ఞాపకాలేనని.. ఎక్కువగా ఆనందపరిచే జ్ఞాపకాలను సంపాదించుకోవడమే అసలైన సంపదగా భావిస్తానని నీతా అంబానీ చెప్పారు. 

లక్షల కోట్లు సంపద కాదు..  జీవితాన్ని ఆస్వాదించడమే సంపద                            

ముఖేష్ అంబానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని పిల్లలతో సమయం గడుపుతారని నీతా అంబానీ కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. జీవితంలో ప్రతిక్షణం విలువైనదేనని.. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇచ్చి జీవితాంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే అసలైన సంపద అని.. నీతా చెబుతున్నారు. క్షణం తీరిక లేకుండా ఉండే ముఖేష్ అంబానీని తరచూ పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొనేలా.. నీతా అంబానీ ప్రోత్సహిస్తూ ఉంటారు. 

ఇటీవల వైరల్ అవుతున్న  నీతా అంబానీ ఇంటర్యూ                           

ఇటీవల అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ పెళ్లిని పూర్తిగా నీతా అంబానీనే డిజైన్ చేశారు. తమ చిన్న కుమారుడి వివాహం.. జ్ఞాపకాల్లో మిగిలిపోవాలని ఆమె.. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని పెళ్లి చేశారు. సెలబ్రిటీలు..కుటుంబసభ్యులకు అనంత్ అంబానీ వివాహం ఓ అద్భుతమైన జాపకంగా ఉండేలా చేశారు. కరణ్ థాపర్ చేసిన ఈ ఇంటర్యూలో నీతా అంబానీతో పాటు ముఖేష్ అంబానీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్యూ చాలా పాతది. కొత్తగా కుమారుడి పెళ్లిని అద్భుతమైన జ్ఞాపకాలు ఉండేలా చేయడంతో.. మరోసారి నీతా అంబానీ సంపద గురించి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget