అన్వేషించండి

Train Ticket : రైలు టికెట్‌ని ఇలా కన్ఫర్మ్ చేసుకోండి..

Telugu News: ట్రైన్ జర్నీ చేసే టైంలో టికెట్ కన్ఫామ్ కాక బాధపడుతుంటారు. సమయం దగ్గర పడుతుంటే ఇంకా వెయిటింగ్ లిస్టులోనే కనిపిస్తున్న తమ టికెట్ పై ఆందోళన వ్యక్తం చేస్తారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆర్టికల్

అకస్మాత్తుగా ఏదైనా సుదూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వస్తే ఎవరైనా తీసుకునే మొదటి ఆప్షన్ రైలు ప్రయాణమే. ఎందుకంటే ఇదే చాలా సౌలభ్యంగా, సుఖంగా మనల్ని గమ్యానికి చేరుస్తుంది. పైగా ఇతర అన్ని ప్రయాణాలతో పోలిస్తే రైలు ప్రయాణం చాలా చవకైనది. ఒక స్లీపర్ క్లాస్ టికెట్..  కచ్చితంగా ఒక  సాధారణ బస్సు టికెట్ కంటే తక్కువ రేటుకే దొరుకుతుంది.

టికెట్ చిక్కకపోవడమే అసలైన చిక్కు.. 

అన్ని రకాలా అనువుగా ఉండే ఈ రైలు ప్రయాణాలతో వచ్చిన  చిక్కేంటంటే నూటికి 70 మంది ఎంచుకునే ఈ రైలు ప్రయాణాల్లో.. సీటు కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. జనరల్ టికెట్ తీసుకుంటే ఎలాగో సీటు దొరకదు అనుకోండి.. స్లీపర్ క్లాస్, 3 ఏసీ, 2 ఏసీ, ఫస్ట్ క్లాస్ వంటి వాటికి టికెట్లు దొరకాలన్నా.. కొన్ని వారాల ముందే రిజర్వ్ చేసుకోవాలి. కొన్ని పర్యాటక ప్రాంతాలకు కొన్ని నెలల ముందు చూసినా వెయిటింగ్ లిస్టు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అర్జంటుగా ఊరికి వెళ్లాలనుకునే వాళ్ళు అప్పటికప్పుడు రైలు ప్రయాణం ఎలా చేస్తారు..?

వెయిటింగ్ లిస్టుతో తంటా..

అర్జెంటుగా ఊరికి వెళ్ళాలా..? ట్రైన్ టికెట్ బుక్ చేసినా.. అది కన్ఫామ్ కాలేదా..? వెయిటింగ్ లిస్టులో ఉందా..? ఇలా అందరికీ తరచూ జరుగుతూనే ఉంటుంది.  ఊరికి వెళ్లాలని ట్రైన్ టికెట్ బుక్ చేయడం.. అది కన్ఫామ్ కాకపోవడం..  తత్కాల్ ట్రై చేయడం.. అది కూడా ఫైనల్ అవ్వక పోవడం..వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్‌ను కన్ఫర్మ్ టికెట్ గా మార్చుకోవడానికి ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఒక్కటి కాదు ఏడు ట్రైన్లలో..

'ఐ ఆర్ సి టి సి రైలు కనెక్ట్' అప్లికేషన్ ఓపెన్ చేయండి. 'మై బుకింగ్ ' లోకి వెళ్లి.. వెయిటింగ్ లిస్టు లో ఉన్న మీ టికెట్ సెలెక్ట్ చేసి... దాని పైన కనిపించే త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ 'ఆప్ట్ ఫర్ వికల్ప్' అనే అప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. అంతే.. ఇప్పుడు మీకు అవైలబుల్ లో ఉన్న ట్రైన్స్ లిస్టు కనిపిస్తుంది. ఏంటీ లిస్టు అంటారా.. అంటే.. మనం టికెట్ బుక్ చేసుకున్న ట్రైన్ లో సీట్లు అన్నీ అయిపోయి ఉండొచ్చు. మనకి వెయిటింగ్ లిస్టు వచ్చి ఉండొచ్చు. కానీ మనం వెళ్లే స్టేషన్‌ నుంచి గానీ దగ్గర్లో ఉన్న స్టేషన్ల నుంచి గానీ.. మనం వెళ్లాలనుకున్న సమయానికి, తరువాతి మూడు రోజులకి అందుబాటులో ఉన్న రైళ్ల లిస్టే అది. అందులోంచి అత్యధికంగా ఏడు రైళ్లని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు సెలెక్ట్ చేసిన రైళ్లలో చార్ట్ ప్రిపేర్ అయ్యే  సమయానికి ఎక్కడ వేకెన్సీ ఉన్నా మీకు కన్ఫామ్ గా టికెట్ దొరుకుతుంది. ఒకవేళ మీరు మొదట బుక్ చేసింది స్లీపర్ కోచ్ అనుకుంటే.. మీరు ఎంచుకున్న ఏడు రైళ్లలో ఆ క్లాస్ అందుబాటులో లేకుంటే అంతకు మించిన క్లాస్‌లో టికెట్‌కు మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తారు.  అది కూడా ఎలాంటి చార్జీలు లేకుండా.  ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరూ ఈ అవకాశాన్ని ఈసారి వాడుకోండి. మీ బ్యాచ్ లో ఎవరైనా ట్రైన్ బుకింగ్స్ కోసం ఇబ్బంది పడుతుంటే.. వాళ్ళకి ఈ సమాచారం షేర్ చేయండి.  

టాప్ హెడ్ లైన్స్

Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget