అన్వేషించండి

Budget Halwa Ceremony: బడ్జెట్ కు ముందు ఘనంగా హల్వా వేడుక, దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Nirmala Sitaraman Halwa Ceremony: ప్రతిసారి బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. ఈ స్వీట్​ని భారీ కడాయిలో తయారు చేసి.. ఆర్థిక మంత్రి సిబ్బందికి వడ్డిస్తారు.

Union Budget 2024 Expectations: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు...ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి.  ఫిబ్రవరి 1న.. కేంద్ర బడ్జెట్​ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు​. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో... ఈసారి మధ్యంతర బడ్జెట్​ని మాత్రమే ప్రవేశపెడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్​ను తీసుకురానున్నారు. మధ్యంతర బడ్జెట్-2024 తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయ  భారతీయ వంటకమైన హల్వా వేడుక జరిగింది. ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్​లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరాద్ పాల్గొన్నారు.  హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు సీతారామన్ పంచిపెట్టారు.  ఈ కార్యక్రమాన్ని ఏటా ఆర్థిక శాఖ ఆనవాయితీగా నిర్వహిస్తోంది. 

ప్రతిసారి బడ్జెట్ కు ముందు హల్వా వేడుక 
ప్రతిసారి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. ఈ ప్రసిద్ధ భారతీయ స్వీట్​ని భారీ కడాయిలో తయారు చేసి.. ఆర్థిక మంత్రి సిబ్బందికి వడ్డిస్తారు. ఇందుకు ఓ కారణం లేకపోలేదు. బడ్జెట్‌ సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే... నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు మీడియాపై ఆంక్షలు విధించారు. ఆర్థిక శాఖకు చెందిన కొందరు సిబ్బంది మాత్రమే ఈ క్రతువులో పాల్గొంటారు. బడ్జెట్‌ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలోనే జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా... కుటుంబసభ్యులకు అక్కడే బస చేస్తారు. బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు. 

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​ని ఆర్థిక మంత్రి లోక్​సభలో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి డాక్యుమెంట్​లోని కీలక అంశాలను క్రోడీకరించి, ప్రతిపాదనల వెనుక ఉన్న ఆలోచనలను ప్రజెంటేషన్ సమయంలో వివరిస్తారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్​ని పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఉభయ సభలు ఆమోదం పొందాక బడ్జెట్​ తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదంతో బడ్జెట్​ అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ చివరి బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సెషన్‌కు ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల నుండి గ్రాంట్ల కోసం చివరి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్‌ల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చు ప్రతిపాదనలను కోరింది. 2024 మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి, తన బడ్జెట్ ను ప్రవేశపెట్టే వరకు అమల్లో ఉండేలా, మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget