అన్వేషించండి

Stamp Paper Rules: ఎన్ని రూపాయల స్టాంపుపై రాస్తే వీలునామా చెల్లుతుంది, రూల్స్ ఏం చెబుతున్నాయి

Will written on stamp Paper | వారసత్వానికి సంబంధించిన స్టాంప్ పేపర్ నిబంధనలు తెలుసుకుంటే వీలునామా సమయంలో ఏ సమస్యా ఉండదు. దీనికి సంబంధించిన చట్టం ఏమిటి, ఎంత స్టాంప్ పేపర్ అవసరం, నియమాలు తెలుసుకోండి.

Stamp Paper Rules: వీలునామా అంటే ఒక వ్యక్తి కోరిక మేరకు రాసే చట్టపరమైన పత్రం. దీని ద్వారా ఆ వ్యక్తి తన ఆస్తిని ఎలా, ఎవరికి పంచాలో నిర్ణయిస్తారు. వీలునామాను చట్టబద్ధం చేయడానికి, దానిని ఒక నిర్దిష్ట స్టాంప్ పేపర్ మీద రాయాలని చాలా మందికి ఒక అపోహ ఉంది. కానీ వాస్తవానికి ఇది నిజం కాదు.

భారతదేశంలో వీలునామా ప్రాముఖ్యత దాని చట్టపరమైన విధానం, సాక్షులపై ఆధారపడి ఉంటుంది. స్టాంప్ విలువపై కాదు. అయినప్పటికీ, కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటించాల్సిన అవసరం ఉంది. తద్వారా వీలునామా విషయంలో ఎటువంటి వివాదం ఉండదు. స్టాంప్ పేపర్ ధర, వీలునామాకు సంబంధించి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

ఎన్ని రూపాయల స్టాంప్ పేపర్ మీద వీలునామా చెల్లుబాటు 

భారత చట్టాల ప్రకారం వీలునామాను ఒక నిర్దిష్ట విలువ కలిగిన స్టాంప్ పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు. దీనిని సాధారణ తెల్ల కాగితంపై కూడా రాయవచ్చు. ఆ వీలునామా పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. ఇది స్పష్టంగా, అర్థమయ్యేలా ఉంటే సరిపోతుంది. అయితే చాలా మంది దీనిని 50 రూపాయలు, రూ.100 స్టాంప్ పేపర్ మీద రాయాలని ఆసక్తి చూపుతారు. 

వీలునామా పూర్తిగా ప్రామాణికంగా ఉండటానికి, ఆ పత్రం చట్టబద్ధం చేయడానికి ఇద్దరు సాక్షులు అవసరం. సంతకం చేసే సమయంలో ఆ సాక్షులు ఉండాలి. ఇది వీలునామా నిజమైనదని ప్రూవ్ చేస్తుంది. నోటరీ లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆప్షన్ మాత్రమే, కానీ ఇది వీలునామా పత్రం చట్టపరమైన చెల్లుబాటును పెంచుతుంది.

వీలునామా రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

వీలునామా రాసేటప్పుడు ఆ పత్రంలో ఆస్తికి సంబంధించిన మొత్తం సమాచారం స్పష్టంగా, సరిగ్గా ఉండాలి. ఎవరికి ఎంత వాటా ఆస్తి ఇవ్వాలో, ఎందుకు ఇస్తున్నారో అందులో స్పష్టంగా పేర్కొనాలి. సంతకం చేసేటప్పుడు వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. తద్వారా తరువాత ఎటువంటి చట్టపరమైన సవాళ్లు ఉండవు. వీలునామాకు ఇద్దరు సాక్షులు అవసరం, అయితే వారు కుటుంబ సభ్యులు కాకపోతే మంచిది.

వీలునామాను నమోదు చేయడం తప్పనిసరి కాదు. కానీ రిజిస్ట్రేషన్ జరిగితే, భవిష్యత్తులో వివాదం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా మార్పులు చేస్తే, వాటిని కూడా లిఖితపూర్వకంగా పేర్కొనాలి. అన్ని నిబంధనలను పాటిస్తే సాధారణ కాగితంపై రాసిన వీలునామా సైతం పూర్తిగా చెల్లుబాటు అవుతుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు 
కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు 
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Chiranjeevi On Vikram 1: విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget