అన్వేషించండి

PM Modi Cabinet 3.0: ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ 3.0 - ఈ విషయాలు మీకు తెలుసా?

PM Modi: ప్రధాని మోదీతో పాటు కొత్త కేంద్ర మంత్రి వర్గం 3.0 ఆదివారం కొలువుదీరింది. మోదీ 3.0 కేబినెట్‌లో గతంలో ఏడుగురు మాజీ సీఎంలకు, ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. గతంలో పని చేసిన 37 మందికి ఈసారి చోటు దక్కలేదు.

PM Modi Cabinet 3.0 Specialities: కేంద్రంలో ఎన్డీయే సర్కార్ 3.0  కొలువుదీరింది. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో సహా 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ మంత్రులుగా, ఐదుగురికి స్వతంత్ర హోదా, 36 మందిని సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది. ఈసారి కేబినెట్‌లో పాత, కొత్త వారికి చోటు లభించింది. ఈసారి కేంద్ర మంత్రివర్గంలో ఏడుగురు మాజీ సీఎంలు, ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు. అటు, మోదీ 2.0 సర్కార్‌లో భాగమైన 37 మందికి ప్రస్తుతం చోటు దక్కలేదు. కాగా, సోమవారం సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో మంత్రుల శాఖపై స్పష్టత రానుంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏడుగురు మాజీ సీఎంలకు ఛాన్స్

కేంద్ర మంత్రి వర్గంలో ఏడుగురు మాజీ సీఎంలకు చోటు లభించింది. ఈ జాబితాలో శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రాజ్‌నాథ్ సింగ్ (యూపీ), మనోహర్ లాల్ ఖట్టర్ (హర్యానా), సర్బానంద్ సోనోవాల్ (అస్సాం), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక), జితిన్ రామ్ మాంఝీ (బీహార్) ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ సీఎంగా పని చేశారు. ఇందులో బీజేపీకి చెందిన వారు ఐదుగురు కాగా.. కుమారస్వామి, మంఝీలు జేడీ(ఎస్), హిందుస్థానీ అవామీ మోర్చాకు ప్రాతినిధ్య వహిస్తున్నారు.

ఏడుగురు మహిళలకు చోటు

ప్రధాని మోదీ సారథ్యంలో కొలువుదీరిన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. వారిలో ఇద్దరికి కేబినెట్ హోదా లభించింది. గత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సహా బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే, అన్నపూర్ణాదేవి, రక్షాఖడ్సే, సావిత్రి ఠాకుర్, నిముబెన్ బాంభణియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్‌లకు మంత్రి పదవులు దక్కాయి. వీరిలో నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవిలకు కేబినెట్ హోదా పొందగా.. మిగిలిన వారు సహాయ మంత్రులుగా పదవులు పొందారు. గతంలో మోదీ కేబినెట్‌లో 10 మంది మహిళా మంత్రులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 7కు తగ్గింది.

37 మందికి దక్కని చోటు

కాగా, గత ప్రభుత్వంలో మోదీ నేతృత్వంలో పని చేసిన 37 మందికి ప్రస్తుత కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వారిలో ఏడుగురు కేబినెట్ హోదా కలిగిన వారు కాగా.. 30 మంది సహాయ మంత్రులుగా పని చేశారు. స్మృతి ఇరానీ, నారాయణ్ రాణె, పురుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, ఆర్.కె.సింగ్, అనురాగ్ ఠాకుర్, మహేంద్రనాథ్ పాండేలు గతంలో కేబినెట్ మంత్రులుగా ఉండగా ఈసారి వీరికి మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ 37 మందిలో 18 మంది ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అటు, గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉండి.. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా ఎల్.మురుగన్ మాత్రం పదవి నిలబెట్టుకున్నారు.

అప్పట్లో సహాయ మంత్రులు.. ఇప్పుడు నో ఛాన్స్

మోదీ 2.0 సర్కారులో సహాయమంత్రులుగా చేసి మోదీ 3.0 మంత్రి వర్గంలో చోటు దక్కని వారు.. వీకే సింగ్, అశ్వినీ చౌబే, ఫగ్గణ్ సింగ్ కులస్తే, రావ్‌సాహెబ్ దాదారావ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సంజీవ్ బల్యాన్, రాజీవ్ చంద్రశేఖర్, సుభాష్ సర్కార్, నిశిత్ ప్రమాణిక్, రాజ్ కుమార్ రంజన్ సింగ్, ప్రతిమా భౌమిక్, మహేంద్రభాయ్, మీనాక్షిలేఖి, అజయ్ కుమార్ మిశ్రా, కైలాశ్ చౌదరి, కపిల్ మోరేశ్వర్ పాటిల్, భారతీ ప్రవీణ్ పవార్, కౌశల్ కిశోర్, భగవంత్ ఖుబా, వి.మురళీధరన్, భాను ప్రతాప్ సింగ్ వర్మ, జాన్ బార్లా, బిశ్వేశ్వర్ టుడు, భగవత్ కిషన్ రావ్ కరాడ్, అజయ్ భట్, నారాయణ స్వామి, దేవుసిన్హ చౌహాన్, సోమ్ ప్రకాశ్, రామేశ్వర్ తేలి, విక్రమ్ జర్దోశ్. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
Delhi Protest: అక్టోబర్ 20 వరకు సాయుధ బలగాలను ఇక్కడే మోహరించండి... కేంద్రానికి ఢిల్లీ పోలీసుల లేఖ
అక్టోబర్ 20 వరకు సాయుధ బలగాలను ఇక్కడే మోహరించండి... కేంద్రానికి ఢిల్లీ పోలీసుల లేఖ
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget