అన్వేషించండి

ఫ్లైట్‌లో పక్కనే కూర్చున్న యువతిని అసభ్యంగా తాకిన ప్రొఫెసర్, అరెస్ట్ చేసిన పోలీసులు

Indigo Flight: ఇండిగో ప్లైట్‌లో ఓ ప్రొఫెసర్ మహిళా ప్యాసింజర్‌ని లైంగికంగా వేధించాడు.

Indigo Flight: 


లైంగిక వేధింపులు..

ఇండిగో ఫ్లైట్‌లో (Indigo Airlines) మహిళా ప్యాసింజర్‌ని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. తనను లైంగికంగా వేధించినట్టు 24 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కంప్లెయింట్ ఆధారంగా నిందితుడు ప్రొఫెసర్ రోహిత్ శ్రీవాస్తవను అరెస్ట్ చేసిన పోలీసులు జ్యుడీషయల్ కస్టడీకి తరలించారు. ఆ తరవాత నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...శ్రీవాస్తవ, బాధితురాలి సీట్‌లు పక్కపక్కనే ఉన్నాయి. జులై 26న ఢిల్లీ నుంచి ఉదయం 5.30 గంటలకు ఇండిగో ఫ్లైట్ ముంబయికి బయల్దేరింది. మరి కాసేపట్లో ముంబయిలో ల్యాండ్ అవుతుందనగా...పక్కనే ఉన్న మహిళను అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు. ఇది సహించలేక బాధితురాలు వాగ్వాదానికి దిగింది. సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ముంబయిలో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరినీ సహార్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లింది ఇండిగో సిబ్బంది. తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు...నిందితుడిపై FIR నమోదు చేశారు. అయితే...ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించలేదు. 

ఇండిగో ప్లైట్‌లోనే మరో ఘటన..

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ కాసేపు అందరినీ టెన్షన్ పెట్టాడు. టేకాఫ్ అయ్యే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ని తెరిచాడు. ఇది చూసి ఒక్కసారిగా ప్రయాణికులు వణికిపోయారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమవడం వల్ల ఘోర ప్రమాదం తప్పింది. నిందితుడు 40 ఏళ్ల హుస్సేన్‌ని ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సెక్యూరిటీకి  అప్పగించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వద్ద కూర్చున్న హుస్సేన్..ఉన్నట్టుండి దాన్ని ఓపెన్ చేశాడు. ఇది గమనించిన క్రూ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వేరే సీట్‌లో కూర్చోబెట్టింది. ఎగ్జిట్ డోర్‌ కవర్‌ని మళ్లీ మూసేసింది. సాధారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ డోర్ తెరుచుకునేలా దానిపై ఓ కవర్‌ అమర్చుతారు. అది కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. కానీ హుసేన్ మాత్రం దాన్ని మాన్యువల్‌గా ఓపెన్ చేశాడు. ఈ కవర్‌ని తీసేస్తే ఘోర ప్రమాదం జరిగే అవకాశముందని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెల్లడించింది. 

"ఎగ్జిట్ డోర్ కవర్‌ని తీసేయడం చాలా ప్రమాదకరం. విమానం గాల్లో ఉండగా అది తెరుచుకుంటే ఆ పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడం అసాధ్యం. అందుకే పొరపాటను కూడా దాన్ని తెరిచే సాహసం చేయకూడదు. నిజానికి అది అంత సులువుగా తెరుచుకోదు. కానీ ఆ వ్యక్తి ఎలా తెరిచాడన్నదే మిస్టరీగా ఉంది. ఎమర్జెన్సీ డోర్‌ పక్కన కూర్చునే ప్రయాణికులకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటాం. పొరపాటున కూడా డోర్ తెరవకూడదని చెప్తాం. అయినా ఇలా ప్రవర్తించారంటే కచ్చితంగా ఇది కావాలని చేసినట్టే. మిగతా ప్రయాణికులనూ ప్రమాదంలోకి తోసినట్టే"

- ఎయిర్‌పోర్ట్ సిబ్బంది

Also Read: కుతకుత ఉడికిపోతున్న భూమి, జులైలో పాత రికార్డులన్నీ బద్దలు - గ్లోబల్ బాయిలింగ్ మొదలైందా?


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget