విద్యార్థినుల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా, వీడియోలు చిత్రీకరించిన స్వీపర్
ఢిల్లీ ఐఐటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు ఉపయోగించే వాష్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![విద్యార్థినుల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా, వీడియోలు చిత్రీకరించిన స్వీపర్ secret camara caught in iit delhi, students complaint police on sweeper విద్యార్థినుల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా, వీడియోలు చిత్రీకరించిన స్వీపర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/de436ba907769b9f6930b11482bdc67f1696729557794840_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఢిల్లీ ఐఐటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు ఉపయోగించే వాష్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐఐటీ-డిల్లీలో కొనసాగుతున్న ఫెస్ట్‌లో భాగంగా శుక్రవారం ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వాష్ రూంను ఉపయోగించారు. అయితే వాష్ రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించినట్లు విద్యార్థినులు గుర్తించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన భారతీ కళాశాల విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై భారతీ కళాశాల విద్యార్థినులు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. వీడియో చిత్రీకరణపై ఫిర్యాదు చేసినా ఐఐటీ-ఢిల్లీ యాజమాన్యం చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేసులో ఓ కాంట్రాక్టు స్వీపర్‌ను అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)