Space Tour: సంతోష్ కులంగార.. 130 దేశాలు తిరిగేశాడు.. ఇక నెక్ట్స్ స్సేస్ లోకే..
సంతోష్ జార్జ్ కులంగార.. కాస్త చెప్పుకోవాల్సిన క్యారెక్టరే.. ది గ్రేట్ ట్రావెలర్ ఇతను. కేరళకు చెందిన పర్సన్. కొన్నిరోజుల్లో స్పేస్ లోకి వెళ్లబోతున్నాడట. ఒక్కసారి ఆయన కథేంటో తెలుసకోవాల్సిందే..
సంతోష్ కులంగార ఇప్పటికే 130 దేశాలు చుట్టేశాడు. ఏడు ఖండాలూ తిరిగాడు. భూమిపై ఏం తిరుగుతాం అనుకున్నాడో.. ఇప్పుడు స్పేస్ లోకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. అటుఇటు అయి.. కలిసి వస్తే.. చంద్రుడు, అంగారక గ్రాహానికి కూడా టూరిస్ట్ గా వెళ్లబొతున్నాడు.
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా.. మరంగట్టుపిల్లిలో 1971లో జన్మించాడు సంతోష్. మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ పోస్టు గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేశాడు. టెలీ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు తీసు ఛానెళ్లకు ఇచ్చేవాడు. ఎడ్యుకేషన్ పుస్తకాలు, మ్యాగజైన్లు ప్రచురించే లేబర్ ఇండియా పబ్లికేషన్స్ ను నడిపాడు. కానీ సంతోష్ కి ఏదో చేయాలని తపన. కొత్తగా ఉండాలని తాపత్రయం. 2001లో సంచారం.. పేరున వీడియో ట్రావెలాగ్ మెుదలు పెట్టాడు. ఓ ఛానెల్ కు ఇచ్చేవాడు. అలాఅని.. తనతో ఓ టీం ఉందనుకుంటే... మీరు పొరబాడినట్లే.. తనే ఎడిటర్, డైరెక్టర్. ఓ బ్యాగ్ భూజన వేసుకుని ఏదో ఓ దేశం వెళ్తాడు. అక్కడి సంగతులను షూట్ చేసి పంపేవాడు. అల్లాటప్పాగా కొండలు, గుట్టలు, బీచ్ లు కాదండి. వెళ్లిన దేశంలోని ప్రాంతాలను పరిశీలించేవాడు. అక్కడి భాష, డ్రెస్సింగ్, ఫుడ్ ఇలా.. మెుత్తం చూశాకే.. దానిపై వీడియో చేసేవాడు.
2013లో సఫారీ టీవీ అని.. ఛానెల్ స్టార్ట్ చేశాడు. అది ఓన్లీ ట్రావెల్ ఛానెల్ మాత్రమే. ఇప్పటి వరకూ అందులో 1800 ఎపిసోడ్ లు పబ్లిష్ అయ్యాయి అంటే గ్రేట్ కదా. ప్రస్తుతం సంచారం ప్రోగ్రాం అందులోనే వస్తోంది. సంతోష్ చేసిన ట్రావెలాగ్స్ కు ఎన్నో అవార్డుకు కూడా వచ్చాయి.
అయితే సంతోష్ ఇప్పుడు స్పెస్ టూర్ కి వెళ్లడానికి అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమ నౌకలో టికెట్ బుక్ చేసుకున్నాడు. వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి బండ్ల శిరీష సహా పలువురు అంతరిక్షయాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ తరహా యాత్రలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌకలో సంతోష్ రోదసియాత్ర చేయనున్నాడు. కొద్ది నెలల్లో అది జరగనుంది.
స్సెస్ టూర్ కోసం.. 2.5 లక్షల డాలర్లు అంటే.. రూ.1.8 కోట్లను సంతోష్ వ్యయం చేయనున్నాడు. టికెట్ కొని రోదసియాత్ర చేసిన తొలి ఇండియన్ గా ఆయన గుర్తింపు పొందనున్నాడు. తనతో పాటు ఓ కెమెరానూ తీసుకెళ్లనున్నాడు. అక్కడి వీడియోను.. సంచారం ఛానెల్ కు ప్రోగ్రాం చేసే అవకాశం ఉంది. 2007 నుంచి అంతరిక్ష యాత్ర చేయాలని సంతోష్ చూస్తున్నారు. ఇందుకోసం శిక్షణ కూడా పూర్తిచేసుకున్నారు. ఇక కొన్ని రోజుల్లో స్పేస్ టూర్ కి వెళ్లనున్నారు సంతోష్ జార్జి కులంగార.