అన్వేషించండి

Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్‌ పోల్‌ అంచనా

ABP CVoter Rajasthan Exit Poll 2023 Highlights: ఈ సారి రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పేలా లేదని ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

ABP CVoter Rajasthan Exit Poll:

రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ 

రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, ఈ సారి కచ్చితంగా తామే గెలుస్తామని బీజేపీ గట్టిగానే ప్రచారం చేసుకుంది. మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాషాయ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికలపై ABP CVoter Exit Poll అంచనాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ 81 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి దాదాపు 20 స్థానాలు కోల్పోనుందన్నది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా. అటు బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి పుంజుకుంటుందని తెలిపింది. పోయిన ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి 104 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. బీఎస్‌పీ గత ఎన్నికల్లో 6 స్థానాలు గెలుచుకున్నప్పటికీ..ఈ సారి మాత్రం ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కి ఈ సారి 71-91 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 94-114 సీట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అంటే గరిష్ఠంగా బీజేపీకి 114 సీట్లు వస్తాయి. ఈ రకంగా చూస్తే...బీజేపీకే ఎక్కువగా విజయావకాశాలున్నాయి. ఓట్ల శాతం పరంగా చూస్తే...కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో 39.3% ఓట్లు సాధించుకుంది. ఈ సారి స్వల్పంగా 41.1%కి పెరిగే అవకాశముంది. బీజేపీకి గత ఎన్నికల్లో 38.8%, ఈ ఎన్నికల్లో 44.7% ఓట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. 

సినారియో -1

ప్రస్తుతం రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే కాంగ్రెస్‌కి 55-65 సీట్లు మాత్రమే దక్కుతాయని ఎగ్జిట్ పోల్‌ అంచనా వేసింది. ఇదే సమయంలో బీజేపీ 130-140 స్థానాలొస్తాయని తెలిపింది. బీఎస్‌పీ 0-2 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. 

సినారియో -2

ప్రభుత్వంపై కాస్తో కూస్తో సానుకూలత ఉంటే కాంగ్రెస్‌కి 91-101 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 88-98 స్థానాలొస్తాయని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. బీఎస్‌పీ 0-2 స్థానాలకు పరిమితం కానుంది. ఇతరులు 0-10 స్థానాలు గెలుచుకోనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Banakacharla Project: ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
ఏపీలో మూడేళ్లలో బనకచర్లకు గోదావరి జలాలు- మూడు నెలల్లో డీపీఆర్, టెండర్లు - హైబ్రీడ్ విధానంలో పనులు 
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Andhra Pradesh Land Rates: ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రాంతాల్లో తగ్గనున్న భూముల రిజిస్ట్రేషన్ రేట్లు- ఫిబ్రవరి 1 నుంచి అమలు
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
Pawan Kalyan On Allu Arjun : అల్లు అర్జున్‌ను ఒంటరిని చేశారు- పుష్ప టీమ్ నుంచి మానవత్వం లోపించింది: పవన్
అల్లు అర్జున్‌ను ఒంటరిని చేశారు- పుష్ప టీమ్ నుంచి మానవత్వం లోపించింది: పవన్
Embed widget