అన్వేషించండి

IndiGo Flight: ఇండిగో విమానం గాల్లో ఉండగా ఊహించని ఘటన, వణికిపోయిన ప్రయాణికులు!

IndiGo Flight: ఇండిగో విమానం గాలిలో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడు.

IndiGo Flight: ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఊహించని ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓ ప్రయాణికుడు అనాలోచిత చర్యతో మిగతా ప్రయాణికులంతా భయంభయంగా గడపాల్సి వచ్చింది. ఒక్కరు చేసిన పనికి మిగతా ప్రయాణికుల్లో కలకలం రేగింది. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరిన ఇండిగో విమానం 6E 6341 లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఢిల్లీ నుంచి చెన్నైకు వెళ్తున్న ఇండిగో విమానం మరికొద్ది సేపట్లో చెన్నైలో ల్యాండ్ అవుతుంది అనగా.. విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు గట్టిగా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దాంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమాన సిబ్బంది అప్రమత్తతతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇండిగో విమానం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవగానే.. ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని విమాన సిబ్బంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. సదరు ప్రయాణికుడిని మణికందన్ గా అధికారులు గుర్తించారు. అతడిపై ఇండిగో సిబ్బంది ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

రెండ్రోజుల క్రితం కుప్పకూలిన విమానం

బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది చనిపోయారు. ఈ ఘోర విమాన ప్రమాదం అమెజాన్ లో జరిగింది. ప్రఖ్యాత టూరిస్టు ప్లేసుగా పేరున్న బార్సెలోస్ లో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తుపాన తరహా వాతావరణం సమయంలో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ప్రయాణికులంతా ఫిషింగ్ కోసం ఈ ప్రాంతాననికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని బ్రెజిల్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 

అమెజాన్ రాష్ట్ర రాజధాని మనౌస్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్ లో ఈ విమానన ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానం మనౌస్ ఏరోట్యాక్సీ ఎయిర్ లైన్స్ కు చెందినది అధికారులు చెబుతున్నారు. ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తామని మనౌస్ ఏరోట్యాక్సీ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. బార్సెలోస్ టౌన్ కి చేరుకునే ముందు వాతావరణం అనుకూలంగా లేని కారణంగా పైలట్ అనుకోకుండా మధ్యలోనే విమానాన్ని ల్యాండ్ చేసినట్లు అమెజాన్ రాష్ట్ర భద్రతా కార్యదర్శి తెలిపారు. అదే సమయంలో విమానం ల్యాండింగ్ స్ట్రిప్ అయిపోయి క్రాష్ అయింది. విమానం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు వేగవంతం చేసినట్లు గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానం EMB-110, బ్రెజిలియన్ విమానాల తయారీ సంస్థ ఎంబ్రేయర్ తయారు చేసిన ట్విన్-ఇంజిన్ టర్బోప్రాప్. అమెజానన్ రాష్ట్ర రాజధాని మనౌస్ నుంచి బార్సిలోస్ కు బయలుదేరిన 90 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను గుర్తించేందుకు రాష్ట్ర రాజధానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget