తమిళనాడులోని మదురైలో జరిగిన జల్లికట్టులో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఎనభై మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


మదురై జిల్లాలోని అవనియపురంలో నిన్న జల్లికట్టు చాలా ఉత్సాహంగా జరిగింది. వందలమంది ఈ వేడుకలో పాల్గొన్నారు.  అదే సంఖ్యలో క్రీడాకారులు కూడా పాల్గొని ఎద్దులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒకరు చనిపోగా... పదుల సంఖ్యలో క్రీడాకారులు గాయపడ్డారని తెలుస్తోంది. 


19 ఏళ్ల క్రీడాకారుడు బాలమురగన్ ఎద్దును పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడి మరణించినట్టు సమాచారం. గాయపడిన ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. 


జల్లికట్టులో 150 మందికి మించి పాల్గొనవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ కరోనా ప్రోటోకాల్‌ కాదని... వందల మంది ప్రజలు వేడుక చూసేందుకు గుమ్మిగూడారు. బాలమురగన్‌ కూడా అలాగే వచ్చి పోటీల్లో పాల్గొన్నాడు. 


అవనియపురంలో జల్లికట్టును తమిళనాడు మంత్రులు పళనివేల్‌ థైగ రాజన్, పీ మూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మదురై ఎంపీ వెంకటేషన్‌తోపాటు కలెక్టర్‌ అనీష్‌ శేఖర్ పాల్గొన్నారు. 


మొత్తంగా 652 ఎద్దులు ఈ వేడుకలో ప్రవేశపెట్టారు. ఈ క్రీడలో పాల్గొనేందుకు సుమారు మూడు వందల మంది క్రీడాకారులను అనుమతి ఇచ్చారు. వాళ్లకు కూడా కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్లనే లోపలికి పంపించారు. 


ఉదయం ప్రారంభమైన వేడుక సాయంత్రం ఐదున్నరకు ముగిసింది. ఎద్దు చాకచక్యంగా లొంగదీసుకున్న కార్తీక్ అనే కుర్రాడిని విజేతగా ప్రకటించారు. ఆయనకు కారును బహుమతిగా ఇచ్చారు. ఇందులో  అత్యుత్తమ ఎద్దు యజమానికి కూడా టూవీలర్‌ను గిఫ్టుగా ఇచ్చారు. 


Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు … మరి దక్షిణాయణం ఏంటి…!


Also Read:  శబరిమలలో మకరజ్యోతి దర్శనార్థం వచ్చిన భక్తుల శరణు ఘోష .. 18 పడిమెట్లు వెనుకున్న ఆంతర్యం ఏంటి...


Also Read: శనివారం మకర సంక్రాంతి... మీపై శనిప్రభావం ఉండకూడదనుకుంటే ఇలా చేయండి..


Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…



Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
Also Read:  అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read:  మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి