ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగే క్షేత్రం…12 జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలం. పరమేశ్వరుడు గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లి కార్తీకేయుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లికార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి. ఇక్ష్వాకులు,రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం శ్రీశైలం. ఈ మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకుని ఈనెల 12 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని 15వ తేదీ మకర సంక్రాంతి రోజున భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించనున్నామన్నారు
Also Read: మీ ఆలోచనా విధానాన్ని బట్టి మీరెలాంటి భోజనం చేశారో చెప్పొచ్చు...
- ఈనెల 12 న ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు
- అదేరోజు సాయంత్రం 5:30 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు
- బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి, వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రం ఉంటేనే దర్శనాలకు అనుమతి
- కరోనా విజృంభిస్తున్న సమయంలో చంటిబిడ్డల తల్లులు శ్రీశైలం యాత్ర వాయిదా వేసుకుంటే మంచిది
- దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలి
- మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు,మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహణ
- ఉత్సవాల సందర్భంగా 12 నుంచి 18వ తేదీ వరకు.. ఆలయంలో రుద్రహోమం, చండీహోమం, సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, స్వామి-అమ్మవార్ల కల్యాణం తాత్కాలికంగా నిలిపివేత
Also Read: మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
ఈ మధ్యే శ్రీశైలంలో స్పర్శ దర్శనం వేళలు పెంచుతున్నట్లు ఆలయ ఈఓ లవన్న చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు సాధారణ భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మహాశివరాత్రి పర్వదినానికి ముందు ఐదు రోజులపాటు గర్భాలయ స్పర్శ దర్శనం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Also Read: భోగి మంటలెందుకు, భోగి పళ్లెందుకు.. ఎందుకు చేయాలి ఇవన్నీ..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి