మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి రోడు స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే  సమస్త కోర్కెలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని అందుకే మోక్షద ఏకాదశి అని అంటారని చెబుతారు. శ్రీ మహా విష్ణువు మూడుకోట్ల మంది దేవతలతో కలసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అష్టాదశ పురాణాల్లో ఉంది. 


Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
ఏకాదశి రోజు ఎందుకు భోజనం చేయరాదు
ఏకాదశిరోజు ఎందుకు భోజనం చేయకూడదో చెప్పేందుకు ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు, విష్ణుభక్తులు, దేవతలను హింసించడం మొదలు పెట్టగా.. ఆ బాధలు తట్టుకోలేక దేవతలు, రుషులు శ్రీ మహా విష్ణువును ప్రార్థిస్తారు. మురతో వెయ్యేళ్లు యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోతాడు.  మహా విష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది.ఈ యుద్ధంలో అలసిపోయిన శ్రీ మహా విష్ణువు ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఈ సమయంలో విష్ణువును సంహరించేందుకు ముర అక్కడకు రావడంతో .. ఆయన తేజస్సు నుంచి యోగమాయ అనే కన్య ఉద్భవించి రాక్షసుడిని సంహరించింది. పక్షంలో పదకొండో రోజు ఆమె ఉద్భవించడంతో ఏకాదశి అని నామకరణం చేసి.. ఈ రోజున ఉపవాసం చేసిన వారికి వారికి సర్వపాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాడని పురాణ కథనం.  ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాపపరిహారం ఉండదని మహా విష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకుని హరి నామస్మరణతో గడిపిన వారికి మహా విష్ణువు అనుగ్రహం కలిగుతుందని పురాణాలు చెబుతున్నాయి. 


Also Read: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..
ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఏడాదికి 24 లేదా 26 వస్తాయి. వీటిన్నింటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది. మోక్షప్రదమైనది. అత్యంత పవిత్రమైనది. ఈ రోజు  ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుందంటారు.ఏకాదశి అంటే 11... ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని అర్థం. వీటిపై నియంత్రణతో వ్రతదీక్ష చేయడమే ఏకాదశి అంతరార్థం. ఈ పదకొండే అజ్ఞానానికి స్థానం.  అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు.   ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం జనవరి 12న వచ్చింది.


Also Read:  అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి