సాధారణంగా శుక్రవారం తలస్నానం చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆడపిల్లని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి శుక్రవారం మంచిందంటారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం అస్సలు తలంటు పోసుకోరాదు. 


Also Read: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..
స్త్రీలు ఏ రోజు తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం
సోమవారం తలంటు పోసుకుంటే నిత్య సౌభాగ్యం
మంగళవారం ఎట్టిపరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు
బుధవారం తల స్నానం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.
గురువారం, శుక్రవారం కూడా తలస్నానం చేయకూడదట
శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది


Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
పురుషులు ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితం
సోమవారం తలంటు పోసుకుంటే అందం పెరుగుతుందట
మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుంది
బుధవారం తల స్నానంతో లక్ష్మీదేవి దీవెనలుంటాయని చెబుతారు
గురువారం తలంటు పోసుకుంటే ఆర్ధిక నష్టాలు పెరుగుతాయి 
శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయ
శనివారం తల స్నానం చేస్తే పురుషులకు మహా భోగం కలుగుతుంది
ఆదివారం  తలంటు పోసుకుంటే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయట


Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..
అయితే పండుగలు, నోములు, పూజలతో పాటూ స్త్రీలకు నెలసరి సమయంలోనూ ఏ రోజైనా స్నానం చేయొచ్చంటారు. కొందరు మంగళవారం, శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజ చేసుకుని ఒక్కపూట భోజనం చేస్తుంటారు. అలాంటి వారు ఆ రోజుల్లో ఉదయం తలంటుపోసుకుని పూజచేస్తారు....అయితే అప్పుడు కూడా తలకు స్నానం సరిపోతుంది తలంటు ( షాంపు, కుంకుడు కాయ లాంటివి పెట్టడం) అవసరం లేదంటారు పండితులు.


Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
మహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని, నలుగు పెట్టుకుని చేయాలి.  తలస్నానం చేసిన రోజున ఎవరైనా ముత్తైదువు ఇంటికి వస్తే బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు ఇస్తే మంచి జరుగుతుందని చెబుతారు. తలంటు పోసుకునే విషయంలోనూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి పాటిస్తుంటారు... ఎవరి విశ్వాసాలు వారివి.


Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి