Vaikuntha Ekadashi : ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..

ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాలన్నీ కళకళలాడిపోతుంటాయి. స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుని ఉపవాసం, జాగరణ ఉంటారు. అయితే ఈరోజు చేసే ఉపవాసం వెనుక ఎన్ని ఆరోగ్య రహస్యాలున్నాయో తెలుసా...

Continues below advertisement

ఆషాఢమాసం నుంచి ఇప్పవరకు వచ్చే ఏకాథులకు ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. చాతుర్మాస దీక్ష ప్రారంభించే వారు ఆషాఢ ఏకాదశి నుంచి ప్రారంభం చేస్తారు ఆ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. అంటే సంతానంకోసం ఆలోచించేవారు ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టి  ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు. భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తనేకాదశి అంటారు. ఈ ఏకాదశిరోజు విష్ణువు ఎడమనుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటారుడని అంటారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశైకాదశి అంటారు. ఈ వ్రతం చేసినవారికి నరకప్రాప్తి లేకుండా ఉంటుందని చెబుతారు. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి మేల్కొటాండని అర్థం. తర్వాత వచ్చేది ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. అందుకే అత్యంత పవిత్రమైన రోజుగా భావించా ఉపవాసం, జాగరణ చేస్తారు.  అసలు ఈరోజున ఉపవాసం ఎందుకు ఉండాలి...

Continues below advertisement

Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
వైద్య పరంగా
మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉంది. ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ.  ఆ తర్వాత జపం, ధ్యానం. జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు,సూర్యుడు,భూమి మధ్య ఉండే దూరం,సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెబుతారు. సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో శరీరంలో ఉన్న వ్యర్థ్యాలు పూర్తిగా బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది.  అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవాసం ఉండాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. 

Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
తాత్వికపరంగా ముక్కోటి ఏకాదశి
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతుంది.  మన మనసులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం లాంట సాధనల ద్వారా ఆరాధించడమని అర్థం . పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ,  మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి.. జ్ఞానాన్ని,ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉపవాసం ద్వారా.... మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే.

Also Read: సంక్రాంతి ఒక్కటే కాదు జనవరి నెలంతా పండుగలే...
Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు …ఎందుకో తెలుసా..
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola