2022 జనవరి 5 బుధవారం రాశిఫలాలు 


మేషం
ఈరోజు మంచి రోజు అవుతుంది. మీ ప్రణాళికల గురించి ఎవరికీ సమాచారం ఇవ్వొద్దు. ఆర్థిక స్థితి అంత బాగోదు. టెన్షన్ పెరగొచ్చు. ఎవరితోనైనా వివాదాలు ఉంటాయి.  ప్రత్యర్థి వర్గం మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయొచ్చు..మీరు విచక్షణతో వ్యవహరించండి.  ఇచ్చిన అప్పు తిరిగి పొందడంలో చాలా ఇబ్బంది పడతారు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.


వృషభం
మీరు ఈ రోజు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. చాలా కష్టపడితనే ఫలితం పొందుతారు. ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. ఓ  శుభవార్త వింటారు. ఇంటికి అతిథులు రావొచ్చు.   తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. పిల్లల వైపు ప్రయోజనం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.


మిథునం
ఈ రోజు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. విద్యార్థులు చదువులో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.  ఈరోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కార్యాలయంలో శుభవార్త వింటారు.  అవసరంలో ఉన్నవారికి సహాయం చేయొచ్చు.  మీ మాటల మీద సంయమనం పాటించండి.


Also Read: ఏ నక్షత్రం వారికి ఏ అక్షరంతో పేరు పెట్టాలంటే..
కర్కాటకం
ఈరోజు కష్టపడి పనిచేసినా సరైన ఫలితాలు రావు. విచారంగా ఉంటారు..ఏదో టెన్షన్ వెంటాడుతుంది.  ఆఫీసులో సహోద్యోగులతో విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఎవరికీ ఏ విషయంలోనూ మాటివ్వవద్దు. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయాణానికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.


సింహం
ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోవద్దు. గాయపడే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్ట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. అనవసరంగా ఖర్చు పెట్టకండి. సంఘర్షణ పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి.


కన్య
అధికారులకు ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు జరగవచ్చు. మీరు వ్యాధి నుండి ఉపశమనం పొందుతారు. అసమతుల్యతను వదులుకోండి. మత్తు, జూదం మొదలైన వాటి వల్ల నష్టం జరుగుతుంది. బంధువులు ఇంటికి వస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. మిత్రులను కలుస్తారు. మీరు వాహనాలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు. మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు సమాచారాన్ని పూర్తిగా పొందండి. న్యాయపరమైన వ్యవహారాలు సాగుతాయి. వివాదాలు ఎవరితోనైనా పరిష్కరించుకోవచ్చు.


Also Read: శని ప్రభావంతో బాధపడుతున్నారా.. అయితే మంగళవారం,శనివారం ఇలా చేయండి..
తుల
ఈరోజు శుభవార్త వింటారు. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తలపెట్టిన పనులు అనుకూల ఫలితాలనిస్తాయి. చాలా కాలంగా ఉన్న సమస్య తీరుతుంది. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. కుటుంబంతో సమయం గడపగలుగుతారు. ఈ రోజంతా సానుకూలంగా ఉంటుంది. 


వృశ్చికం
మీ గత తప్పులను సరిదిద్దుకోండి. ఎవరితోనూ అసభ్యంగా మాట్లాడకండి... తర్వాత పశ్చాత్తాప పడాల్సి రావొచ్చు. మీ సమస్యను పరిష్కరించడానికి మీరు ఒకరి సహాయం తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. విద్యార్థులకు ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం వింటారు.  ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. 


ధనస్సు
దినచర్యలో మార్పులు చేసుకుంటారు. పాత మిత్రులను కలుస్తారు. ఎవరితోనైనా వాగ్వాదం ఉండొచ్చు, వాహనం జాగ్రత్తగా నడపండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల సమయం.  మానసిక ప్రశాంతత ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.


Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు …ఎందుకో తెలుసా..
మకరం 
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వ వ్యవహారాలు కష్టంగా ఉంటాయి. ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు కొనసాగుతాయి. సోమరితనం వీడండి.  సహోద్యోగితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. మీ మాటల మీద సంయమనం పాటించండి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. 


కుంభం
మీరు ఈ రోజు కొత్త అవకాశాలను పొందొచ్చు. ఓ శుభవార్త అందుతుంది. స్నేహితుని సహాయంతో ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. కొత్త పనులు లాభిస్తాయి. వ్యాపారస్తులు తమ భాగస్వాములపై ​​నిఘా ఉంచాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ రహస్య ప్రణాళికను బహిర్గతం చేయవద్దు. ప్రమాదకర పనిని జాగ్రత్తగా చేయండి.  ఆదాయ వనరులు పెరుగుతాయి


మీనం
ఈరోజు మీరు ప్రయామం చేయాల్సి రావొచ్చు.  ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు రావొచ్చు. ఎవరితోనైనా ఆకస్మిక వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలున్నాయి. అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య సంతోషం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది.  వృద్ధులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరికైనా సహాయం చేయవచ్చు.


Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి