పుట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగుపెట్టిన స్త్రీ.. అమ్మ అనే పిలుపుకోసం తపించిపోతుంది. ఈ బంధంతో రెండు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అందుకే గర్భవతి అనే విషయం తెలిసినప్పటి నుంచీ ఇరు కుటుంబాల్లో సందడే సందడి. కొందరైతే శ్రీమంతం లాంటి వేడుకలతో మరింత ఆనందాన్ని నింపుతారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయడం మంచిది కాదని పురాణాలు చెబుతున్నాయి. అలా చేస్తే పుట్టబోయే బిడ్డకి అరిష్టమంటారు. 


Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
ఇలా చేస్తే బిడ్డకు అరిష్టమంటారు
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు. 
చెట్ల‌ు నరకడం, మొక్కలకు పురుగుల మందు చల్లడం చేయరాదు
7 నెలలు నిండిన ప్రసవం అయ్యేవరకూ క్షవరం( గడ్డం) చేసుకోకూడదు
శవాల‌ను మోయరాదు, అంతిమ యాత్రల్లో పాల్గోకూడదు, ప్రేత కర్మలు, పిండ ప్రదానాలు చేయరాదు
భార్య కడుపుతోఉందని తెలిసిన తర్వాత తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేయకూడదు
పడవలు ఎక్కడం, పర్వతారోహన చేయడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి
శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు లాంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలట
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను విడిచి దూరంగా వెళ్లకూడదు


Also Read:వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
ఇవన్నీ పురాణాల్లో చెప్పారన్న విషయం పక్కనపెడితే.. వాస్తవానికి గర్భవతి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం. ఆమె ఆరోగ్యం ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే ఈ ఇల్లాలికి ధైర్యంగా ఉంటుంది. తద్వారా సమస్య వస్తుందేమో అనే భయం కానీ, వచ్చినా ఏం జరుగుతుందో అనే భయం లేకుండా జీవిత భాగస్వామి ఉన్నారులే చూసుకుంటారనే భరోసా ఉంటుంది. పైగా తీర్థయాత్రలు, కొండలెక్కడం, పడవ ప్రయాణాల కోసం దూరప్రాంత ప్రయాణాలు చేస్తే ఏదైనా జరిగితే ఆ కుటుంబం జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అందుకే అవకాశం ఉన్నంతవరకూ భార్య దగ్గర ఉంటూ భరోసా ఇవ్వడం ద్వారా తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని అంటారు. పురాణాల్లో ఏం చెప్పినా అంతా మన క్షేమం కోసమే కదా అంటారు పెద్దలు. 
Also Read: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
Also Read: మధుబన్ లో ఏం జరిగింది, సన్నీ లియోన్ సాంగ్ పై ఎందుకీ వివాదం..


Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి