ఏ దేవుడికి జరగని విధంగా ఆంజనేయ స్వామికి తమలపాకు సేవను అత్యంత గొప్పగా నిర్వహిస్తారు. ఆయనకు ప్రత్యేకమైన మంగళవారం, శనివారాల్లో తమలపాకులతో పూజిస్తారు. అసలు ఆంజనేయుడికి తమలపాకులకు ఉన్న అనుబంధమేంటి ..


Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
దీని వెనుకున్న పురాణ కథలేంటంటే
1.ఒకసారి సీతమ్మ అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని దగ్గరకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ''స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడట. అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని వివరించారట. వెంటనే ఆంజనేయుడు  ఒళ్లంతా తమలపాకులు కట్టుకుని రాముడి దగ్గరకు వచ్చాడట.


2.మరో కథ ప్రకారం.. అశోకవనంలో ఉన్న సీతమ్మకి, హనుమంతుడు రాములవారి సందేశం చెప్పినప్పుడు, అమ్మవారు అక్కడ అందుబాటులో ఉన్న తమలపాకులతో దండ గుచ్చి వేశారట. అందుకే హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం అని చెబుతారు. 


Also Read:  11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
వాయుపుత్రుడిని తమలపాకులతో పూజిస్తే ఈ ఫలితాలు వస్తాయట
1. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే అనారోగ్యం తగ్గుతుందంటారు
2. ఇంట్లో దోషాలున్నాయని భావించే వారు తమలపాకుల హారాన్ని సమర్పిస్తే పీడ తొలగిపోతుందట.
3. సంసార జీవితంలో ప్రశాంతత లేనివారు తమలపాకుల హారం వేస్తే మంచిదట 
4. అనారోగ్యం పాలయ్యే చిన్నారుల పేరుమీద హనుమంతుడికి తమలపాకులు సమర్పిస్తే ఆరోగ్యం బావుంటుందని చెబుతారు
5. వ్యాపారంలో నష్టపోతున్న వారు, శని ప్రభావంతో బాధపడుతున్న వారు కూడా తమలపాకులు సమర్పిస్తే మంచి జరుగుతుందట. 


Also Read: సంక్రాంతి ఒక్కటే కాదు జనవరి నెలంతా పండుగలే...
6. వైద్య పరంగా నయంకానీ వ్యాధులున్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, వాటిని ప్రసాదంగా తీసుకుంటే రోగాలు నయనమవుతాయంటారు.
7. సుందర కాండ పారాయణం చేసి తమలపాకు హారం సమర్పిస్తే చేపట్టిన పనులన్నీ సక్సెస్ అవుతాయట. 
8. హనుమాన్ చాలీసా చదివి తమలపాకుల హారాన్ని వేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది.
9. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు. 


ఇలాగే చేయాలని లేదు..ఎవరి  విశ్వాసాలు వారివి. ఏం చేసినా నమ్మకం ప్రధానం.


Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు …ఎందుకో తెలుసా..
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి