చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది కీర్తి సురేష్. తెలుగు, తమిళం, మలయాళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులోనే గుడ్ లక్ సఖి, భోళా శంకర్, సర్కారు వారి పాట సినిమాలు చేస్తోంది. అలాగే తమిళంలో సాని కాయిదం అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పుడు మరో సినిమాలో సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో నిజజీవితంలో రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్‌తో ఆమె జత కట్టనుంది.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే హీరోయిన్ ను ఇంతవరకు తేల్చలేదు. చివరికి కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది కీర్తి. షూటింగ్ శరవేగంగా చేయాలనుకుంటోంది చిత్రయూనిట్. అన్నట్టు ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్ర చేయబోతున్నారు. 


ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు. గతేడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకీ పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందే ఆయన హీరోగా పలు సినిమాల్లో నటించారు. ఎమ్మెల్యే అయ్యాక మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఉదయనిధి మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో రెండు షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరొకటి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. 






Also Read: నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇల్లరికం రావాల్సిందే... అమ్మను విడిచి ఉండలేను...


Also Read: బాసూ... క్లాస్‌గా మెగాస్టార్ మాస్ స్టెప్పేస్తే? ఫుల్ సాంగ్ వచ్చేసింది... చూశారా?
Also Read: 'రాధే శ్యామ్' నిర్మాతలకు కొత్త తలనొప్పి... రోజుకు ఓసారి ఆ మాట చెప్పాల్సిందేనా?
Also Read: త్రివిక్రమ్ క్లాప్‌తో సినిమా మొదలు... బుధవారం నుంచి క్లాసులు!
Also Read: కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?
Also Read: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..
Also Read: The Boss: రామ్ గోపాల్ వర్మ బాబాగా మారితే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి