నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. దీనికి మ్యాచో స్టార్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి అతిథిగా వచ్చారు. యాక్చువల్లీ... రానా కూడా 'నంబర్ వన్ యారి' టాక్ షోకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షోకి బాలకృష్ణ వెళ్లారు. 'అన్ స్టాపబుల్' షోకు వచ్చిన రానా "నా టాక్ షోల్లో బెస్ట్ ఎపిసోడ్... ప్రతి సీజన్‌లో మీదే" అని చెబితే... "కొత్తగా చెప్తావేంటయ్యా? బాలకృష్ణ అంటేనే బెస్ట్" అని నట సింహ అన్నారు.'అన్ స్టాపబుల్' షోకు వచ్చిన వాళ్లను బాలకృష్ణ ప్రశ్నలు అడుగుతారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఈసారి బాలకృష్ణను రానా ప్రశ్నలు అడిగారు. 'ఆర్గ్యుమెంట్ అయితే... ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు?' అని బాలకృష్ణను రానా అడిగారు. తానే సారీ చెబుతానని 'i do' ప్లకార్డ్ చూపించారు బాలకృష్ణ. అనంతరం ''కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు... బాలకృషుడు ఓ లెక్కా!?'' అని ఆయన కన్ను కొట్టారు. షోలో బాలయ్య చేత ఆయన శ్రీమతి వసుంధరకు ఫోన్/వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయించారు రానా. ''ఎప్పుడైనా వసుంధర గారికి ఐ లవ్ యు అని చెప్పారా?'' అని అడగడంతో పాటు ఐ లవ్యూ చెప్పించారు. "నాకు తెలుసు... మీరు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తారు" అని వసుంధర బదులు ఇచ్చారు.
రానాను కూడా బాలకృష్ణ బాగా ఇంటర్వ్యూ చేశారు. ''కరోనా టైమ్‌లో వ్యాక్సిన్ వస్తుందని అనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబు" అని బాలకృష్ణ నవ్వించారు. అంతకు ముందు... 'ఫస్ట్ టైమ్, బాలకృష్ణ టాక్ షో చేస్తున్నాడంటే... నీకు ఏమనిపించింది?' - రానాను బాలయ్య అడిగారు. 'మేమంతా మామూలు ట్రయిన్‌లో వెళుతుంటే... మీరు బుల్లెట్ ట్రైన్ తీసుకుని వచ్చారు' అని రానా ఆన్సర్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ జనవరి 7 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.