Balakrishna: లెఫ్ట్ హ్యాండ్ రెడీ.. వాళ్లు ఎదురుపడితే దబిడిదిబిడే.. వార్నింగ్ ఇచ్చిన బాలయ్య.. 

బాలయ్య ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. వాళ్లు కనిపిస్తే దవడ పగలగొడతానని అంటున్నారు. 

Continues below advertisement

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత నెటిజన్లు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. వారు ఏ చిన్న పొరపాటు చేసినా.. సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. దాదాపు అందరు హీరోలు, హీరోయిన్లు ట్రోలింగ్ బారిన పడ్డారు. నందమూరి బాలకృష్ణను కూడా బాగా ట్రోల్ చేస్తుంటారు. ఆయనేం చేసినా.. ఏం మాట్లాడినా.. ట్రోల్స్ పడుతూనే ఉంటాయి. ఈ విషయం బాలయ్య వరకు వెళ్లినట్లు ఉంది. అందుకే ఆయన ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

Continues below advertisement

వాళ్లు కనిపిస్తే దవడ పగలగొడతానని అంటున్నారు. బాలయ్య హోస్ట్ గా 'ఆహా'లో 'అన్ స్టాపబుల్' అనే షో టెలికాస్ట్ అవుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ షోకి రవితేజ వచ్చారు. ఈ సందర్భంగా రవితేజ-బాలకృష్ణల మధ్య గొడవలు ఉన్నాయంటూ చాలా రోజులుగా వార్తలు వస్తోన్న విషయాన్ని ఇద్దరూ మాట్లాడుకున్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ క్లారిటీ ఇచ్చారు. 

ఇద్దరూ తమ మాటలతో పంచ్ లతో షోని రసవత్తరంగా నడిపించారు. ఇక షో చివర్లో ట్రోలర్స్ కి క్లాస్ పీకారు బాలయ్య. 'ఏదేదో చెబుతూ.. ఊరూ, పేరూ లేకుండా ఎక్కడో ఉంటూ సోషల్ మీడియాలో ఫేక్ విషయాలను వ్యాప్తి చేసేవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు' అంటూ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. ఇటీవల సర్జరీ జరిగిన లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందని.. ట్రోలర్స్ ఎదురుపడితే దబిడిదిబిడే అంటూ గట్టిగా చెప్పారు. 

అసలు ఇప్పటివరకు బాలయ్య ఎప్పుడూ ట్రోలింగ్ మీద స్పందించలేదు. కానీ ఈసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం వెనుక కారణం ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఇక సినిమాల విషయానికొస్తే.. 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ నెలాఖరు నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇందులో బాలయ్యకి ధీటుగా కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. 

Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..

Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..

Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola