టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గర్భవతి అయిన కారణంగానే ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. తాజాగా ఈ విషయం నిజమేనంటూ కాజల్ భర్త గౌతమ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గౌతమ్ '2022.. నిన్నే చూస్తున్నా..' అంటూ ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని ఎటాచ్ చేశారు. ఇది చూసిన అభిమానులు కాజల్-గౌతమ్ లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలోనే జూనియర్ కాజల్ రాబోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కాజల్ తల్లి కాబోతుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
తెలుగులో దాదాపు అందరి హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది ఈ జంట. పెళ్లి తరువాత కూడా నటిగా సినిమాలు చేసిన కాజల్. ప్రస్తుతం ఆమె నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక 'భారతీయుడు 2' సినిమా నుంచి ఆమె తప్పుకుందని సమాచారం.
Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.
Also Read: ఆవకాయ్ సీజన్‌లో 'అంటే సుందరానికి'... చక్కిలిగింతల్ పెడుతుందని!
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన స్టార్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి