నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. ఇందులో మలయాళ కుట్టి నజ్రియా నజిమ్ (Nazriya Fahad) కథానాయిక. ఈ రోజు... జనవరి 1, కొత్త ఏడాది సందర్భంగా సినిమాలో నాని ఫస్ట్ లుక్ (Nani Look In Ante Sundaraniki) విడుదల చేశారు. అంతే కాదు... సినిమాను ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తున్న ప్రకటించారు.
'అంటే సుందరానికి' సినిమాలో నాని ఫస్ట్ లుక్‌తో పాటు 'ప్రవర ఆఫ్ సుందర' పేరుతో ఓ వాయిస్ టీజర్ విడుదల చేశారు. దాన్నిబట్టి హీరో బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపించనున్నట్టు అర్థం అయ్యింది. అన్నట్టు... ఈ సినిమాలో నాని పేరు ఏంటో తెలుసా? కొన్ని రోజులుగా 'K.P.V.S.S.P.R Sundara Prasad' (కె.పి.వి.ఎస్.ఎస్.పి.ఆర్ సుందర్ ప్రసాద్) అని చెబుతున్నారు కదా! పూర్తి పేరును ప్రవరలో చెప్పారు. 'కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర్ ప్రసాద్' - ఇదీ సినిమాలో నాని పేరు.
సుందర్ ప్రపంచానికి నాని స్వాగతం చెప్పారు. అలాగే, 'ఈ ఆవకాయ్ సీజన్‌లో సినిమా వస్తుంది' అని జీరోత్ టీజర్‌లో స్పష్టం చేశారు. 'అంటే సుందరానికి చమ్మర్‌లో చక్కిలిగింతలా' అంటూ చిన్న పిల్లలతో చెప్పించి... దర్శకుడు క్రియేటివిటీ చూపించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన స్టార్స్!
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
Also Read: ఒక్క పోస్టర్, ఒక్క డేట్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్!
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి