'రాధే శ్యామ్' సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది? జనవరి 14న! సినిమా యూనిట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ అది! ఇప్పటి వరకూ వాయిదా వేస్తున్నట్టు యూనిట్ సభ్యులు ఎవరూ స్పందించలేదు. కానీ, జనవరి 14న 'రాధే శ్యామ్' విడుదల కావడం లేదని, వాయిదా పడిందని కొత్త ఏడాదిలో ఒకటే ప్రచారం మొదలు అయ్యింది. జనవరి 1న న్యూ ఇయ‌ర్ విషెస్‌తో పాటు 'రాధే శ్యామ్', 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలను వాయిదా వేశారని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు. వాటన్నిటికీ 'రాధే శ్యామ్' టీమ్ చెక్ పెట్టింది.ప్రభాస్, పూజా హెగ్డే కౌగిలించుకున్న ఓ స్టిల్‌ను న్యూ ఇయర్ సందర్భంగా 'రాధే శ్యామ్' టీమ్ విడుదల చేసింది. "ఈ కొత్త ఏడాదిలో ప్రేమకు, విధికి మధ్య పెద్ద యుద్ధాన్ని చూడండి" అని పేర్కొన్నారు. ఈ పోస్టర్, కాప్షన్ కంటే... పోస్ట‌ర్‌లోని ఓ డేట్‌ ప్రేక్షకులను పరిశ్రమకు ఎక్కువ ఆకర్షించింది. 'జనవరి 14, 2022' అని పోస్టర్ మీద పేర్కొన్నారు. దీని అర్థం ఏమిటి... ముందుగా వెల్లడించిన తేదీకి సినిమా విడుదల అని పరోక్షంగా చెప్పారు. దాంతో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టినట్టు అయ్యింది. సినిమా యూనిట్ సభ్యులు సైతం వదంతులను నమ్మవద్దని తెలిపారు.

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. సౌత్ వెర్ష‌న్స్‌కు జస్టిన్ ప్రభాకరన్, హిందీ వెర్ష‌న్స్‌కు  మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు.

Also Read: దేశానికి సర్పంచ్ ఏంట్రా? సోగాళ్ళ హంగామా... యాక్షన్ అదిరిందిగా!Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడ‌క్ష‌న్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమాAlso Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?Also Read: ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి