కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభిస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన షేక్ పేట ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నూతన సంవత్సరం తొలి రోజున ప్రారంభించిన ఈ ఫ్లై ఓవర్‌ను రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్ పేట్ , ఫిలింనగర్ జంక్షన్ ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించారు. రూ.333 కోట్ల వ్యయంతో టోలిచౌకి నుంచి రాయదుర్గాన్ని కలిపేలా ఈ వంతెన నిర్మించారు.
పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవు ఫ్లైఓవర్ తరువాత మరో పెద్ద ఫ్లైఓవర్ షేక్‌పేట ఫ్లై ఓవర్. 2.71 కిలోమీటర్ల పొడవున కొత్త ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌తో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు మహా ఉపశమనం లభించనున్నది. ఇటీవల మిథాని - ఒవైసీ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు నిర్మించిన షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను నూతన సంవత్సరం తొలి రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
2018లో స్ట్రాటజిక్ రోడ్ డెలవప్‌మెంట్ ప్లాన్ కింద తెలంగాణ సర్కార్ పలు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఐటీ కారిడార్ కష్టాలు తీర్చేందుకు కూకట్ పల్లి నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీకి ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగింది. తాజాగా షేక్‌పేట ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ నుంచి ఐటీ కారిడార్ వచ్చే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయని అధికారులు చెబుతున్నారు. నగరంలో అతిపెద్ద ఫ్లై ఓవర్లలో ఒకటైన తాజా వంతెన ద్వారా మెహదీపట్నం-హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Also Read: Liquor Sales: తెలంగాణలో కిక్ ఎక్కించిన మద్యం అమ్మకాలు.. ఈ 5 రోజుల్లో మందుబాబులు అన్ని కోట్లు తాగేశారా..!
Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?