కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడంలో యావత్ ప్రపంచం బిజీగా ఉన్న టైంలో జమ్ముకశ్మీర్‌లో తీవ్రప విషాదం నింపే ఘటన జరిగింది. ప్రముఖ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో 12మంది ప్రాణాలు కోల్పోయారు.
జమ్మకశ్మీర్‌లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
త్రికూట కొండలపై ఉన్న మందిరం గర్భగుడి వెలుపల మూడో నంబర్ గేట్ దగ్గర తొక్కిసలాట జరిగింది. PTI చెప్పిన వివరాల ప్రకారం 2022 కొత్త సంవత్సరం నాడు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనుకున్న దాని కంటే ఎక్కువ మంది ఒక్కసారిగా ఎగబడటంతో వారిని ఆలయ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు, ఆలయ బోర్డు ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు చేపట్టారు. జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ "కత్రాలోని మాతా వైష్ణో దేవి భవన్‌లో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు, కొంతమంది గాయపడ్డారు. ఈ సంఘటన తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది."
తొక్కిసలాటలో 12 మంది మరణించారని, వారి మృతదేహాల గుర్తింపు జరుగుతోందని ఇతర ప్రక్రియ కోసం కత్రా బేస్ క్యాంపులోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ గోపాల్ దత్ ప్రకారం... మృతులు దిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్ముకశ్మీర్ చెందిన వారిగా గుర్తించారు.
గాయపడిన ఇరవై మందిలో ఎక్కువ మంది మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటన తర్వాత కాసేపు ఆలయ దర్శనాలు నిలిపేశారు. అంతా సద్దుమణిగిన తర్వాత దర్శనాలకు అనుమతి ఇచ్చారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారని అధికారులు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయా ఫ్యామిలీలకు సంతాపం తెలిపారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడానని తెలిపారు.
ఈ ప్రమాదం గుండెల్ని పిండేసిందన్నారు హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ప్రమాదంలో బాధితులు త్వరగా కోలుకోవాలని వేడుకున్నారు.
Also Read: జియో యూజర్లకు అలెర్ట్.. ఈ మెసేజ్ వచ్చిందా?
Also Read: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను ఇలా తెలుగులో విష్ చేయండి, అందమైన కోట్స్ ఇవిగో...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.