Jio Alert: జియో యూజర్లకు అలెర్ట్.. ఈ మెసేజ్ వచ్చిందా?

జియో తన వినియోగదారులకు ఫేస్ మెసేజ్‌లకు సంబంధించిన అలెర్ట్‌ను అందించింది.

Continues below advertisement

భారతదేశ నంబర్ వన్ మొబైల్ నెట్ వర్క్ జియో తన వినియోగదారులను హెచ్చరించింది. ఈ-కేవైసీ అంటూ వచ్చే ఫేక్ మెసేజెస్‌కు స్పందించవద్దని వినియోగదారులకు సూచించింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇప్పటికే తమ వినియోగదారులకు దీనికి సంబంధించిన అలెర్ట్‌ను అందించారు.

Continues below advertisement

ఈ-కేవైసీ గురించి తమ తరఫు నుంచి ఎటువంటి మెసేజ్‌లు రావని, వాటికి అస్సలు స్పందించవద్దని వినియోగదారులను కోరింది. కొత్త సంవత్సరం సందర్భంగా స్కామ్ కాల్స్ మరింత పెరిగిపోయే అవకాశం ఉందని తెలిపారు. న్యూ ఇయర్, పండుగ ఆఫర్లు అంటూ ఏవైనా లింకులు కనిపిస్తే వాటిని అస్సలు క్లిక్ చేయవద్దని తెలిపింది.

ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటూ వచ్చే కాల్స్‌కు కూడా అస్సలు స్పందించవద్దని కోరింది. తెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. కొన్ని జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకుని భారీ మోసాలు జరపకుండా నిరోధించవచ్చని వెల్లడించింది.

Continues below advertisement
Sponsored Links by Taboola