ABP  WhatsApp

Piyush Jain Case: ఆ డబ్బు మాది కాదు.. అఖిలేశ్ ఎందుకు వణికిపోతున్నారు?: నిర్మలా సీతారామన్

ABP Desam Updated at: 31 Dec 2021 08:25 PM (IST)
Edited By: Murali Krishna

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఐటీ దాడుల్లో దొరికిన డబ్బు భాజపాదు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

ఆ డబ్బు మాదేం కాదు: నిర్మలా సీతారామన్

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరుగుతోన్న ఐటీ దాడులపై కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ స్పందించారు. అత్తరు వ్యాపారి వద్ద ఇటీవల దొరికిన రూ.200 కోట్లు భాజపా సొమ్ము కాదని నిర్మలా అన్నారు. శుక్రవారం జరిగిన జీఎస్​టీ మండలి సమావేశం అనంతరం నిర్మలా మీడియాతో మాట్లాడారు. 







నిఘా వర్గాల సమాచారం మేరకే ఆ రోజు పన్ను ఎగవేత కేసులో ఐటీ శాఖ సదరు వ్యాపారిపై దాడులు నిర్వహించింది. పక్కా సమాచారంతో సరైన వ్యక్తిపైనే ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. పర్ఫ్యూమ్​ వ్యాపారి పీయూష్​ జైన్ ఇంటి నుంచే అధికారులు రూ. 200 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదేం భాజపా సొమ్ము కాదు. అయినా అంత పెద్ద మొత్తం డబ్బు దొరికిందంటే.. మన అధికారులు ఎంత నిజాయితీగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. అయితే ఆ డబ్బు భాజపాదేనని ఆయనకు (అఖిలేశ్ యాదవ్) ఎలా తెలుసు? మీరు ఆయన భాగస్వామా? ఎందుకంటే అది ఎవరి డబ్బో భాగస్వాములకే తెలుస్తుంది. అఖిలేశ్ యాదవ్ ఎందుకు వణికిపోతున్నారు?                                                       - నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి


దేశవ్యాప్తంగా..


దేశవ్యాప్తంగా పన్ను ఎగవేసిన పలువురు అత్తరు వ్యాపారుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు చేసింది ఐటీ శాఖ. కన్నౌజ్, కాన్పుర్, నేషనల్ కేపిటల్ రీజైన్, సూరత్ మాత్రమే కాకుండా ముంబయి సహా 20 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసింది ఆదాయ పన్ను శాఖ.


ఏబీపీ న్యూస్ సమచారం మేరకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్‌ఎల్‌సీ పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ, అత్తరు డీలర్ మాలిక్ మియాన్స్ నివాసాల్లో ఈ ఐటీ దాడులు జరిగాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఐటీ శాఖ దాడులు చేపట్టింది. కోల్‌కతాలోని పుష్పరాజ్ జైన్‌కు చెందిన పలు సంస్థలకు సంబంధించిన దస్త్రాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఇటీవల జీఎస్​టీ ఎగవేత కేసులో ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్‌ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు నిర్వాహించారు. కన్నౌజ్​లోని ఆడ్​కెమ్​ ఇండస్ట్రీస్​కు చెందిన ఇళ్లు, కార్యాలయాల నుంచి ఇప్పటివరకు తాము రూ.197 కోట్ల నగదు, 26 కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనెను స్వాధీనం చేసుకున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్​ జీఎస్​టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు తెలిపారు.


Published at: 31 Dec 2021 08:25 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.