దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 16,764 కరోనా కేసులు నమోదుకాగా 7,585 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 220 మంది కరోనాతో మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 91,361కి చేరింది. రికవరీ రేటు 98.36%గా ఉంది.







మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1000 దాటింది. ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,270గా ఉంది.


మహారాష్ట్ర..







మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 198 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా ఇందులో 190 ఒక్క ముంబయిలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది.


మహారాష్ట్రలో కొత్తగా 5,368 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 66,70,754కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,217 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


దీంతో మహారాష్ట్ర సర్కార్ కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు విధించింది. గురువారం అర్థరాత్రి ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.


గుజరాత్..


గుజరాత్‌లో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,31,078కి చేరింది. అయితే కొత్తగా ఒక ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది.


Also Read: Covaxin: పిల్లలపై 'కొవాగ్జిన్‌' ఉత్తమ ఫలితాలు.. తుది దశ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.