Quinton De Kock Retirement: టెస్టు క్రికెట్‌కు డికాక్ గుడ్‌బై... కెరీర్ ముగిసిపోలేదని ప్రకటన
Quinton De Kock Retirement: టెస్టు క్రికెట్‌కు డికాక్ గుడ్‌బై... కెరీర్ ముగిసిపోలేదని ప్రకటన
ABP Desam Updated at:
31 Dec 2021 10:57 AM (IST)
దక్షిణాఫ్రికా కీపర్, బ్యాట్సమెన్ డికాక్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పకుంటున్నట్టు షాక్ ఇచ్చాడు. ఫ్యామిలీ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించాడు.
భారత్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్న సఫారీలకు మరో దెబ్బ తగిలింది. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ డికాక్ ప్రకటించాడు. తక్షణమే తాను టెస్టు క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారాయన.
ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడానికి రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటించాడు సౌతాఫ్రికా క్రికెటర్ డికాక్. డికాక్ కోట్ చేసినట్టు ఓ స్టేట్‌మెంట్‌ను దక్షిణాఫ్రికా రిలీజ్ చేసింది.
ఈ నిర్ణయాన్ని చాలా సింపుల్‌గా నేను తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ ఏంటి... ఎలా ఉండబోతుందని చాలా సమయం ఆలోచించాను. నేను నా భార్య సాషా మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలకబోతున్నాం. ఇప్పుడు నా కుటుంబం అంతకు మించి ఎదగాలి. ఈ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నా ఫ్యామిలీకి అండగా ఉంటానో అని ఆలోచించాను. నా ఫ్యామిలీయే నాకు సర్వస్వం. అలాంటి ఫ్యామిలీకి మరింత సమయాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో వారికి అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. దేశం తరఫున ఆటడం అంటే ఇంకా ఇష్టం. ఒడిదుడుకులను చాలా ఆస్వాధించాను. వేడుకలు, చీత్కారాలు కూడా ఎదుర్కున్నాను. వాటన్నింటి కంటే ఎక్కువ ఇష్టపడే వాటి కోసం నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో కాలం తప్ప అన్నింటినీ కొనుక్కోవచ్చు. అందుకే నాకు అమితమైన వారి కోసం మరింత టైం ఇవ్వాలనుకుంటున్నాను. నా టెస్టు క్రికెట్ ప్రయాణంలో భాగమై ప్రోత్సహించిన వారికి, అవకాశాలు కల్పించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు, నిర్వహకులకు, నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను. వాళ్ల సహాయ సహకారాలు లేనిదే నేను లేను. ఇది నా క్రీడా జీవితానికి ముగింపు కాదు. వైట్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. దేశం తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాను. - డి కాక్, దక్షిణాఫ్రికా క్రికెటర్
టెస్టు సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు అద్భుతంగా రాణించాలని కోరుకుంటూ తన సహచర సభ్యులకు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు డి కాక్.