దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను తీవ్రంగా భయపెడుతోంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1300కు చేరువైంది. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతి చెందాడు.
మహారాష్ట్రలో..
పుణెలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. బాధితుడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం చేసిన పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే బాధితుడు ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. కానీ, ఆరోగ్య నిపుణులు మాత్రం ఆ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కరోనా మరణంగా వర్గీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు.
భారీగా కేసులు..
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 198 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా ఇందులో 190 ఒక్క ముంబయిలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది.
మహారాష్ట్రలో కొత్తగా 5,368 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 66,70,754కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,217 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దీంతో మహారాష్ట్ర సర్కార్ కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు విధించింది. గురువారం అర్థరాత్రి ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
Also Read: Omicron Cases India: దేశంలో కొత్తగా 16,764 మందికి కరోనా.. 1200 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: Covaxin: పిల్లలపై 'కొవాగ్జిన్' ఉత్తమ ఫలితాలు.. తుది దశ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.