RRR Movie First Review: రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి' లాంటి సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న ఈ సినిమాని రాజమౌళి తన ఫ్యామిలీ, కొందరు స్నేహితులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ఎలా ఉందనే విషయం బయటకు వచ్చింది.
అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయట. ఎమోషనల్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారట. 'ఛత్రపతి' సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ట్రీట్మెంట్ కి ఐదారు రెట్లు ఎక్కువ డోస్ తో 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉంటుందట. ఒలీవియా మోరిస్ తో ఎన్టీఆర్ లవ్ ట్రాక్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ సీన్లు అభిమానులకు పూనకాలే అని టాక్. విజువల్స్, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఎసెట్స్ అని అంటున్నారు.
అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల మధ్య స్నేహాన్ని రాజమౌళి అద్భుతంగా చూపించారట. సినిమాలో ప్రతి సన్నివేశంలో రాజమౌళి మార్క్ కనిపిస్తుందని టాక్. 'ఆర్ఆర్ఆర్' ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని రాజమౌళి సన్నిహిత వర్గాలు చాలా నమ్మకంగా చెబుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.
దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ విజువల్ వండర్ ని చూడాలంటే జనవరి 7వరకు ఎదురుచూడాల్సిందే!
Also Read:అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..
Also Read:ముంబై స్లమ్ డాగ్.. బాక్సింగ్ బరిలోకి దిగితే.. దేవరకొండ ఫ్యాన్స్ కి పూనకాలే..
Also Read: ప్రేమలో కళ్లు మూసుకుపోయాయ్... కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
Also Read: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి