'నాన్నా! నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకొంటే... తనను పెళ్లి చేసుకుంటాను' - రష్మీ గౌతమ్'నా గురించి నీకు తెలియదు. పరువు కోసం నేను ప్రాణం ఇవ్వడానికి అయినా... తీయడానికి అయినా సిద్ధం' - 'రాకెట్' రాఘవ'నాన్నా... మీరు అర్థం చేసుకుంటారని నేను చాలా ట్రై చేశాను. ఐ యామ్ సారీ నాన్న!' - రష్మీ గౌతమ్
న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా మల్లెమాల సంస్థ చేసిన 'పెళ్లాం వద్దు... పార్టీ ముద్దు' ప్రోగ్రామ్ ప్రోమోలో డైలాగ్స్. ఈ ప్రోగ్రామ్‌లో రష్మీ గౌతమ్ ఓ డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు. అందులో ప్రేమకు తండ్రి నుంచి అంగీకారం లభించలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమ్మాయిగా రష్మీ గౌతమ్ కనిపించారు. అది చూసి మరో యాంకర్ లాస్య కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను అదే విధంగా చేశానని చెప్పుకొచ్చారు. పెళ్లి సమయంలో చేసిన పనికి ఇప్పుడు తాను బాధపడుతున్నట్టు ఆమె మాటలను, చేతలను బట్టి అర్థం అవుతోంది.
"నేను ఇలాగే చేసి వచ్చాను మా నాన్నకు! మా నాన్న గుర్తు వచ్చారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్న లాస్య... రష్మీ గౌతమ్‌ను హగ్ చేసుకున్నారు. "మనల్ని ప్రేమించే వాళ్లను మనం ఎంత బాధ పెడుతున్నాం అనేది తెలుసుకోం. ఎందుకంటే... అప్పుడు కళ్లు మూసుకుపోయి ఉంటాయి కదా! అప్పుడు ప్రేమలో ఉంటాం కదా! నేను అలాగే చేశాను కదా! రష్మీ పెర్ఫార్మన్స్ చూస్తే మా నాన్న గుర్తు వచ్చారు" అని కన్నీళ్లతో వివరించారు. ఆమెను భర్త మంజునాథ్, రష్మీ గౌతమ్ ఓదార్చారు.
Pellam Vaddu Party Muddu - 2022 New Year Special Event Promo 04: