కోలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు అజిత్ కుమార్. ఆయన కోట్ల మంది అభిమానులు ఉన్నారు. కానీ తను స్టార్ అనే గర్వాన్ని ఎక్కడా చూపించరు. ఎలాంటి హడావిడి కూడా చేయరు. చాలా సింపుల్ గా ఉంటారు. కనీసం తన సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనరు. సినిమాలో నటించడం వరకే ఆయన పని.. ఆ తరువాత రిలీజ్ పనులన్నీ దర్శకనిర్మాతలకు వదిలేసి ఆయన మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతారు.
నటుడిగా తన పని తాను చేసుకుంటూపోతారు. అసలు ఆఫ్ స్క్రీన్ అజిత్ కనిపించడమే చాలా అరుదు. ఆయన వ్యక్తిత్వం గురించి, సింప్లిసిటీ గురించి ఆయన్ను కలిసిన చాలా మంది గొప్పగా చెబుతుంటారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా అజిత్ గురించి గొప్పగా మాట్లాడారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఓ తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూకు వెళ్లారు రాజమౌళి. అందులో భాగంగా అజిత్ ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అజిత్ తో తనకున్న మంచి అనుభవం గురించి గుర్తు చేసుకున్నారు రాజమౌళి.
ఆయన మాట్లాడుతూ.. 'రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నప్పుడు భోజనం చేయడానికి అక్కడే ఉన్న సితార హోటల్ కి వెళ్లాను. రెస్టారెంట్ లోపలకు వెళ్లగానే అజిత్ గారు ఒక టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ కనిపించారు. ఎవరో నేనొచ్చానని ఆయన చెబితే.. భోజనం మధ్యలోనుంచి లేచి నా దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి నన్ను లోపలకు తీసుకెళ్లారు. అంత పెద్ద స్టార్ అలా చేయడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతలో నా భార్య రమా వస్తోందని తెలిసి.. మళ్లీ ఆయన లేచి డోర్ దగ్గరకి వెళ్లి తనను తాను పరిచయం చేసుకొని ఆమెని లోపలకి తీసుకొచ్చారు. ఆయన సింప్లిసిటీకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు' అంటూ చెప్పుకొచ్చారు.
అలానే రీసెంట్ గా ఆయన అభిమానులను ఉద్దేశించి ఓ స్టేట్మెంట్ ఇచ్చారని రాజమౌళి అన్నారు. కోట్లమంది అజిత్ ను 'తల' అంటుంటే.. అలా పిలవొద్దని.. తనను కేవలం 'అజిత్ లేదా ఏకే' అని మాత్రమే పిలవమని చెప్పడం గొప్ప విషయమని ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పారు రాజమౌళి.
Also Read:ముంబై స్లమ్ డాగ్.. బాక్సింగ్ బరిలోకి దిగితే.. దేవరకొండ ఫ్యాన్స్ కి పూనకాలే..
Also Read: ప్రేమలో కళ్లు మూసుకుపోయాయ్... కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
Also Read: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: ప్రేమకథ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వచ్చింది? రాజమౌళి వైఫ్ చేసిందేమిటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి