ఎప్పటి నుంచే సాగుతున్న ఇండ్‌భారత్‌ థర్మల్‌ పవర్‌ కంపెనీ కేసు విషయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2018లో రిజిస్టర్‌ అయిన కేసు విషయంలో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రఘురామ సహా 16 మందిని నిందితులుగా తేల్చింది. కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని మోసం చేశారని తన ఛార్జిషీట్‌లో పేర్కొంది కేంద్రదర్యాప్తు సంస్థ. 
2018 అక్టోబర్ 3న ఇండ్‌భారత్‌సహా డైరెక్టర్లపై కేసు రిజిస్టర్‌ అయింది. 2019 ఏప్రిల్‌ 29న సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఈ ఎంక్వయిరీలో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయని చెబుతోంది సీబీఐ. 
తమిళనాడులో ట్యుటికోరిన్‌ థర్మల్‌ విద్యుదుత్పత్తి సంస్థ ఏర్పాటు చేస్తామంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఛైర్మన్‌గా ఉన్న ఇండ్‌భారత్‌ కంపెనీ 947.71 కోట్లు రుణం తీసుంది. ఈ రుణాన్ని ఆర్‌ఈసీ, ఐఐఎఫ్‌సీఎల్‌తో కూడిన కన్సార్షియం నుంచి తీసుకుంది. ఈ డబ్బుతో థర్మల్‌ విద్యుదుత్పత్తి కంపెనీ పూర్తి చేయలేదు కదా రుణ ఒప్పంద రూల్స్‌ కూడా పాటించలేదు. 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో ఆ రుణాలను మళ్లించారని సీబీఐ ఆరోపణలు చేస్తోంది. కాంట్రాక్టర్లకు అడ్వాన్సుగా చెల్లింపులు చేశారని పేర్కొంది. పిక్స్‌డ్‌ చేసిన డబ్బు నుంచి మళ్లీ రుణాలు తీసుకున్నారని సీబీఐ ప్రధాన ఆరోపణ. ఈ ప్రక్రియతో అప్పులు ఇచ్చిన కంపెనీలు నష్టపోయాయని పేర్కొంది సీబీఐ. 
థర్మల్‌ కంపెనీ ఏర్పాటు పేరుతో ఇండ్‌ భారత్‌ కంపెనీ అక్రమంగా నిధులు వాడుకుందని... దీని వల్ల కన్షార్షియం 947.71 నష్టపోవడానికి కారణమైందని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. 


మరోవైపు ఇదే కేసులో ఇండ్‌భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ దివాలా సంస్థగా ప్రకటించింది నేషనల్‌ కంపెనీలా ట్రైబ్యునల్‌.  పరిష్కారానికి అనుమతిస్తూ హైదరాబాద్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. ఇండ్‌ భారత్‌ కంపెనీ తీసుకున్న 327.51కోట్లు చెల్లించకపోవడంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పిటిషన్ వేసింది. రూ. 1383.38కోట్ల వసూలు కోసం దిల్లీ రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌లో బ్యాంకుల కన్సార్షియం పిటిషన్ వేశాయి. వీటికి ఇండ్‌ భారత్‌ కంపెనీ 872.63 కోట్లను మాత్రమే హామీ ఇచ్చింది. 
ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ వేసే ముందు తమకు నోటీసులు ఇవ్వలేదని... వ్యక్తిగత పిటిషన్ వేయడానికి వీల్లేదని అందుకే దివాలా ప్రక్రియకు అనుమతి ఇవ్వొద్దంటూ ఇండ్‌భారత్‌ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అన్ని అంశాలను పరిశీలించాక ఇండ్‌ భారత్‌ థర్మల్‌ దివాలా ప్రక్రియ చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. దివాలా పరిష్కార నిపుణుడిగా శ్రీకాకుళం వంశీకృష్ణను నియమించింది. ఇండ్‌ భారత్‌ ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం విధించింది. 


Also Read: తమిళ హీరోలు ప్రజల కోసం పోరాడతారు... తెలుగు హీరోలు తమ కోసం కూడా నోరెత్తలేరా ? .. టీడీపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి