Gold Silver Price Today 1st January 2022: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వరుసగా మూడో రోజులు బులియన్ మార్కెట్లో తగ్గిన పసిడి ధరలు నేడు పెరిగాయి. మరోవైపు వెండి ధర పడిపోయింది.  తాజాగా హైదరాబాద్‌‌లో 22 క్యారెట్లపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 కి చేరుకుంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,400కి పడిపోయింది.


ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.210 మేర పెరిగింది. ఇక్కడ సైతం వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,100కు చేరింది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం ధర రూ.200 మేర పుంజుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 కు చేరింది. వెండి ధరలు ఏపీ, తెలంగాణలో ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ మార్కెట్లోనూ కేజీ ధర రూ.100 మేర పతనం కావడంతో వెండి ధర రూ.65,400 ట్రేడ్ అవుతోంది.


దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం రూ.200 మేర పెరగడంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,520కి పుంజుకుంది. చెన్నైలో రూ.250 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,370 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250 అయింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 అయింది.


తగ్గిన ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.19 మేర తగ్గింది. నేడు హైదరాబాద్‌లో, ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.22,990 అయింది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,990 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Jio Alert: జియో యూజర్లకు అలెర్ట్.. ఈ మెసేజ్ వచ్చిందా? 
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి! 
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి