Bangarraju Teaser: దేశానికి సర్పంచ్ ఏంట్రా? సోగాళ్ళ హంగామా... యాక్షన్ అదిరిందిగా!

కొత్త ఏడాదిలో కొత్త టీజర్... 'బంగార్రాజు'తో తండ్రీ తనయులు వచ్చేశారు. సోగాళ్ళ హంగామా, యాక్షన్ అదిరింది!  

Continues below advertisement

కింగ్ నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా 'బంగార్రాజు'. 'మళ్ళీ వచ్చాడు'... అనేది ఉప శీర్షిక. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వస్తున్నారు. గతంలో ఆయన తీసిన 'సోగ్గాడే చిన్ని నాయనా'లో ఆల్రెడీ నాగార్జున సోగ్గాడుగా కనిపించారు. ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ 'బంగార్రాజు'లో నాగ చైతన్య కూడా సోగ్గాడిగా కనిపించనున్నారు. టీజ‌ర్‌లో తండ్రీ త‌న‌యులు ఇద్దరూ ఇరగదీశారు.
'బంగార్రాజు' టీజ‌ర్‌కు వస్తే... నాగార్జున మరోసారి ఆత్మగా కనిపించారు. సోగ్గాడిగా నాగార్జున స్ట‌యిల్‌ను నాగ చైతన్య బాగా పట్టుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన స్టయిల్ బావుంది. నాగార్జున నడుమును రమ్యకృష్ణ గిల్లగా... 'ఊరుకోవే పుటుకీ, కితకితలు పెడుతున్నాయి' అని అనడం ఆకట్టుకుంది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అమ్మాయిగా కృతీ శెట్టి కనిపించారు. 'నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు... మన రాష్ట్రానికి సర్పంచ్‌వి కావాలి. దేశానికి సర్పంచ్‌వి కావాలి' అని ఆమెకు లైన్ వేసే కుర్రాడిగా  చైతు కనిపించారు. 'దేశానికి సర్పంచ్ ఏంటే? ఏదో ప్లాన్‌లో ఉన్నాడు' అని కృతీ శెట్టితో ఆమె స్నేహితురాలు అనడం... ఆ కామెడీ టైమింగ్ వర్కవుట్ అయ్యాయి. దేవుడి సన్నిధిలో అపశ్రుతి అంటూ సినిమాపై ఆసక్తి పెంచారు. నాగార్జున, నాగ చైతన్య యాక్షన్ సీన్స్ కూడా అదిరాయి.

Continues below advertisement

సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టు టీజ‌ర్‌లో చెప్పారు.  రావు రమేష్, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరి, రోహిణీ, ప్రవీణ్ తదితరులు ఇతర తారాగణం. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 
Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడ‌క్ష‌న్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
Also Read: ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement