Bheemla Nayak Prepone!: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' ముందుకు వస్తుందా? సంక్రాంతికి  సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారా? పూర్తి వివరాలు ఇవిగో!

Continues below advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కథానాయకులుగా నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. మరోసారి సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధం అవుతోందా? ఒకవేళ కుదిరితే సంక్రాంతి కంటే ముందు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోందా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. సినిమాను మళ్లీ ముందుకు తీసుకు రావడం కుదురుతుందా? అంటే... 'కష్టమే' అని సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'భీమ్లా నాయక్' సినిమాను విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. సంక్రాంతి బరికి రెండు పాన్ ఇండియా సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' ఉండటంతో... ఆయా సినిమాల దర్శక - నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రిక్వెస్ట్ చేయడంతో పరిశ్రమ మేలు కోసం 'భీమ్లా నాయక్'ను వాయిదా వేశారు. అయితే... జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడం లేదనే వార్తతో 'భీమ్లా నాయక్' ముందుకు రావొచ్చని అంటున్నారు.
Also Read: ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?
ఆల్రెడీ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేశారు. రానా, మిగతా ఆర్టిస్ట్స్ డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యిందట. అయితే... సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ ఫినిష్ కావడానికి మరో 15 రోజుల సమయం పడుతుందని తెలిసింది. త్వరగా ఆ వర్క్స్ ఫినిష్ చేయిస్తే... సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి నుంచి వాయిదా వేయడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొంచెం నెమ్మదిగా చేస్తున్నారు. అదీ సంగతి! అసలు... 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' సినిమాలు వాయిదా పడ్డాయని అధికారికంగా ప్రకటనలు వచ్చిన తర్వాత 'భీమ్లా నాయక్' బృందం విడుదల విషయమై ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ విడుదల విషయం పక్కన పెడితే... న్యూ ఇయర్ సందర్భంగా 'భీమ్లా నాయక్' సినిమాలో 'లా... లా... భీమ్లా' సాంగ్ డీజే వెర్షన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Continues below advertisement


Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Also Read: బాలకృష్ణతో సినిమా ప్రకటించిన దర్శకుడు... స్క్రిప్ట్ రెడీ!

Also Read: అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement