నట సింహ నందమూరి బాలకృష్ణ మాంచి జోరు మీద ఉన్నారు. ఓ సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలు ఎక్కించడానికి రెడీ అవుతున్నారు. 'అఖండ' విజయంతో థియేటర్లకు ఫుల్ జోష్ తీసుకు వచ్చిన ఆయన... తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వచ్చారు. ఇదే జోష్‌లో ఆయన కొత్త సినిమాలకు ఓకే చెబుతున్నారు.
'అఖండ' తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనికి బాలకృష్ణ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. 'అఖండ' విడుదలకు ముందు నవంబర్ నెలలో ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. బాలకృష్ణకు అది 107వ సినిమా. దాని తర్వాత 108వ సినిమా ఎవరి దర్శకత్వంలో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు తెలిపారు. లేటెస్టుగా దర్శకుడు సంపత్ నంది సైతం బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్టు చెప్పారు.
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
వేములవాడ దేవాలయానికి వెళ్లిన సంపత్ నంది, దర్శనం అనంతరం బాలకృష్ణ సినిమా విషయాన్ని వెల్లడించారు. స్క్రిప్ట్ రెడీ అయ్యిందని, వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి పాదాల చెంత స్క్రిప్ట్ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సంపత్ నంది నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో ఉంటుందా? లేదంటే అనిల్ రావిపూడి సినిమా తర్వాత సినిమా అవుతుందా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. బాలకృష్ణ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. 

Continues below advertisement





Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Also Read: 'గాలోడు' టీజర్.. సుడిగాలి సుధీర్‌ మాస్ అవతార్..
Also Read: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
Also Read: అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి