Sudigali Sudheer: 'గాలోడు' టీజర్.. సుడిగాలి సుధీర్ మాస్ అవతార్..
సుధీర్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'గాలోడు'. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
Continues below advertisement

'గాలోడు' టీజర్..
బుల్లితెరపై పలు టీవీ షోలతో కమెడియన్ గా, హోస్ట్ గా బాగా పాపులర్ అయ్యారు సుడిగాలి సుధీర్. వీటితో పాటు మ్యాజిక్ షోలు, అదిరిపోయే స్టంట్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. చాలా రోజులుగా అతడు నటుడిగా తన సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. 'సాఫ్ట్‌వేర్ సుధీర్', '3 మంకీస్' అనే చిత్రాల్లో నటించారు. కానీ ఆ సినిమాలు వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఆయన ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు.
సుధీర్ హీరోగా నటించిన నూతన చిత్రం 'గాలోడు'. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. శుక్రవారం నాడు ఈ సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. 'అదృష్టాన్ని నమ్ముకున్న వారు కష్టాలపాలు అవుతారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అదృష్టవంతులవుతారు. నేను రెండింటినీ నమ్ముకోను. నన్ను నేను నమ్ముకుంటాను' అని సుధీర్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.
యాక్షన్ సీక్వెన్స్ లు, ఫైట్స్ లలో మంచి ఇంటెన్సిటీ ఉంది. సుధీర్ యాక్షన్స్ సీన్స్ లో బాగా నటించారు. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహ్నా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తోంది. సప్తగిరి, పృథ్వీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read:అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..
Also Read:ముంబై స్లమ్ డాగ్.. బాక్సింగ్ బరిలోకి దిగితే.. దేవరకొండ ఫ్యాన్స్ కి పూనకాలే..
Also Read: ప్రేమలో కళ్లు మూసుకుపోయాయ్... కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Continues below advertisement