మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో శుక్రవారం బంగారం ధర ₹198 లాభపడింది మరియు 10 గ్రాముల స్థాయికి ₹48,083 వద్ద ముగిసింది. అయితే గత ఆరేళ్లలో బంగారం ధరలు తక్కువగా నమోదు కావడం తొలిసారి అన్ని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. 2021లో బంగారం ధరలు 4 శాతానికి పైగా నష్టపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధర శనివారం రూ.48,000 స్థాయిలో ఉంది. అయితే బంగారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ.56,200 నుంచి 10 గ్రాములకు రూ.8,000 కంటే తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
రూ.8 వేలకు దిగువకు బంగారం
కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఇవాళ బంగారం ధర ఆల్-టైమ్ హై నుంచి దాదాపు రూ.8,000 తక్కువగా ఉంది. బులియన్ మెటల్ 1800 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ అవకాశాన్ని కొనుగోలుదారులు వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గత 15 రోజుల ట్రేడ్‌లో 1820 డాలర్ల నుంచి 1835 డాలర్లకు బంగారం ధరలు పెరిగింది. బంగారం ధరలు స్పాట్ మార్కెట్ ద్వారా నిర్ణయిస్తారు. వచ్చే 3 నెలల్లో బంగారం ఒక్కో ఔన్సు స్థాయికి 1880 డాలర్ల నుంచి 1900 డాలర్లకు పెరగవచ్చని నిపుణలు అంటున్నారు. బంగారం పెట్టుబడిదారులకు 'బయ్ ఆన్ డిప్స్'ని కొనసాగించాలని సూచించారు. మరో నెలపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని బంగారు నిపుణులు తెలిపారు. కాబట్టి ఒక ఔన్స్‌కి $1760 నుంచి $1835 వరకు బంగారం పెరిగే అవకాశాన్ని కొనుగోలుపై ఆన్ డిప్స్ వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు.
"ఈ రోజు స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుల రేంజ్ లో $1760 నుంచి $1835 వరకు ట్రేడవుతోంది. ఇది త్వరలో ఔన్సు స్థాయికి $1880 నుంచి $1900 వరకు పెరగవచ్చు. మొత్తంమీద స్వల్పకాలికంగా బంగారం ధర తగ్గినా స్పాట్ మార్కెట్‌లో $1800 స్థాయి కంటే దిగువకు వచ్చిన ప్రతిసారీ ఇన్వెష్టర్లను భారీగా ఆకర్షిస్తుంది. ప్రస్తుత బంగారం ధర ట్రేడింగ్ సానుకూల ధోరణిని సూచిస్తుంది. బంగారంలో పెట్టుబడులకు అది సదావకాశం" అని నిపుణులు అంటున్నారు.
Also Read: Jio Alert: జియో యూజర్లకు అలెర్ట్.. ఈ మెసేజ్ వచ్చిందా?
బై ఆన్ డిప్ అంటే
ధరలు క్షీణించినప్పుడే కొనుగోలు చేయాలి. సమీప భవిష్యత్ లో ఆ ధరలు మళ్లీ పెరుగుతాయి. డిప్‌లో ఉన్నప్పుడు కొనుగోలు చేయాలి, అది తిరిగి పుంజుకుంటుందనే అంచనాతో లేదా భవిష్యత్తులో (సమీపంలో లేదా దీర్ఘకాలికంగా) అప్ డ్రెండ్ అవుతుందనే అంచనాతో దానిని కొనుగోలు చేయడం.
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం రూ.200 మేర పెరగడంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,520కి పుంజుకుంది. చెన్నైలో రూ.250 మేర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,370 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250 అయింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 అయింది.
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?