మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రత్తిపాడులో సీఎం జగన్ పెంచిన పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో తన సంవత్సర వేళ ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్‌పైనే చేశానమని చెప్పినట్లుగా పెంచుకుంటూ పోతున్నామన్నారు. ఏపీలో 62 లక్షల కుటుంబాల్లో చిరునవులు కురిపిస్తున్నామని దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనేన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ. నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని.. తాము కొన్నివేల కోట్లను ఖర్చు పెడుతున్నామన్నారు. పేదలకు మంచి చేస్తూంటే ఓర్చుకోలేకపోతున్నారని సీఎం జగన్ విమర్శించారు.
Also Read: అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయా ? అప్పు కోసమా ? నిజంగానే పూర్తి చేస్తారా ?
గత ప్రభుత్వం 36 లక్షల మందికే పెన్షన్ ఇచ్చిందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులే పెన్షనర్లను ఎంపిక చేసేవారని.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెంచామని తెలిపారు. కుల,మత, రాజకీయాలకతీతంగా పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. ఈ నెలలో కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లుగా తెలిపారు.
గత నెల వరకూ రూ.2,250 చొప్పున ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లలో 18,44,812 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ.1,570 కోట్లకు పైనే వెచ్చిస్తూ.. ఏటా రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.45 వేల కోట్లు అని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్...